పిక్‌టాక్ : యోగా ఫోజ్ చూపు తిప్పనివ్వని ఇషా
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి పలు అందాల పోటీల్లో గెలిచిన ముద్దుగుమ్మ ఈషా గుప్తా బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.;
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి పలు అందాల పోటీల్లో గెలిచిన ముద్దుగుమ్మ ఈషా గుప్తా బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోల కారణంగా ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య దాదాపుగా రెండు కోట్ల అనే విషయం తెల్సిందే. తన ఫాలోవర్స్‌కు ఎప్పటికప్పుడు కన్నుల విందు చేయడం కోసం, వినోదాన్ని పంచడం కోసం తన అందమైన ఫోటోలను షేర్ చేయడంతో పాటు, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంది.
సోషల్ మీడియాలో తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. నేడు యోగా దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేకమైన పోస్ట్‌ను ఈషా షేర్ చేసింది. ఈషా చేతులపై తన బాడీ మొత్తం వెయిట్ ఆపుతున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా చేతుల మీద అలా బాడీని ఆపడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ట్రైనింగ్, ఎంతో శ్రమ చేసి ఉంటే తప్ప అలా సాధ్యం కాదు. ముద్దుగుమ్మ ఈషా రెబ్బ సుదీర్ఘ కాలంలో యోగా ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలోనే ఇలా చేతులపై మొత్తం బాడీని బ్యాలెన్స్ చేసి ఉంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. హీరోయిన్స్ లో అతి కొద్ది మంది మాత్రమే ఇలా బ్యాలన్స్ చేయగలరు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
యోగా చేస్తున్న సమయంలో ఈషా గుప్తా వేసుకుని ఉన్న ఔట్ ఫిట్ విషయంలో కొందరు విమర్శలు చేస్తూ ఉంటే కొందరు మాత్రం ఆమె అందాల ఆరబోతకు ఫిదా అవుతున్నారు. కనీసం చూపు తిప్పనివ్వడం లేదు అంటూ అభిమానులతో ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత యోగా ఆసనం ఫోటోలు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద తెగ వైరల్ అవుతున్నాయి. యోగా డే సందర్భంగా ఎంతో మంది హీరోయిన్స్ ఇలా యోగాసనాలు వేసి మరీ తమ యొక్క మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. ఈషా గుప్తా సైతం ఇలా తన యొక్క యోగా ఫోజ్ ను షేర్ చేయడం ద్వారా యోగా వల్ల ఉపయోగాలను చెప్పకనే చెప్పింది.
1985లో జన్మించిన ఈషా గుప్తా ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2007 కిరీటాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా 2007 లో మిస్ ఇంటర్నేషనల్ కి సైతం ప్రాతినిధ్యం వహించింది. జన్నత్ అనే సినిమాతో 2012లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్‌కి నామినేట్ కాబడింది. తెలుగులో కూడా ఈమెకు గుర్తింపు ఉంది. ఈమె హిందీలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాల్లో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొంత కాలంగా ఆసినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా ఇలాంటి ఫోటోలతో అభిమానులకు చేరువగానే ఉంటుంది.