ఇండియన్ సినిమాకు కొత్త అధ్యాయం లోక..!

శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్ నుంచి ఇప్పటికే 7 సినిమాలు నిర్మించాడు.;

Update: 2025-08-30 09:39 GMT

హీరోగానే కాదు నిర్మాతగా కూడా దుల్కర్ సల్మాన్ అదరగొట్టేస్తున్నాడు. అభిరుచి గల నిర్మాతగా దుల్కర్ తన వేఫరర్ ఫిలింస్ బ్యానర్లో మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా లోక అంటూ ఒక సినిమా నిర్మించారు దుల్కర్ సల్మాన్. ఈ సినిమాను డామినిక్ అరుణ్ డైరెక్ట్ చేయగా కళ్యాణి ప్రియదర్శన్, నెస్లెన్ లీడ్ రోల్ లో నటించారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్ నుంచి ఇప్పటికే 7 సినిమాలు నిర్మించాడు. వాటిల్లో ఈ లోక సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది.

భారీ స్కేల్ లో లోక..

ముఖ్యంగా ఒక ఫిమేల్ సెంట్రిక్ కథతో ఇంత అది కూడా మలయాళంలో ప్రయత్నించడం గొప్ప విషయం. ఈ భారీ కాన్వాసే సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు దుల్కర్ సల్మాన్ విజన్ ఏంటన్నది తెలిసేలా చేసింది.

మలయాళ సినిమాల్లో ఇదివరకు ఎప్పుడు లేని విధంగా దుల్కర్ సల్మాన్ ఒక కొత్త అడుగు వేశాడు. ఇది నిజంగానే ఒక బోల్డెస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. లోకాతో ఒక కొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయ్యింది. వేఫారర్ సినిమా నిర్మించిన ఈ సినిమా అన్ని అడ్డుగోడలను దాటేసింది. మలయాళంలో ఎప్పుడు కూడా కొత్త తరహా కథలు సినిమాలు వస్తుంటయి. ఐతే లోక అందులో కూడా చాలా స్పెషల్ సినిమా అని చెప్పొచ్చు. దుల్కర్ సల్మాన్ వల్లే ఇలాంటి అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు ఇలాంటి చరిత్ర సృష్టించే సినిమా అతని వల్లే సాధ్యమైంది.

ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్

డైరెక్టర్ రైటర్ బ్రిలియన్స్ ప్రతి ఫ్రేం లో కనిపించింది. అతను ఏదైతే చూపించాలని అనుకున్నాడో అది విజువల్ గా వచ్చేలా పని చేయించుకున్నాడు. లోక సినిమా నిమిష్ రవి విజువల్స్ అదిరిపోయాయి. మలయాళ సినిమాలో కమర్షియల్ అంశాలు చాలా తక్కువ అన్న టాక్ ఉంది. ఈ సినిమా చూస్తే ఆ మాట మార్చేస్తారు. లోక సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కూడా బాగా హెల్ప్ అయ్యింది.

శుక్రవారం రిలీజైన లోక సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కళ్యాణ్ ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో ఆమె స్టెల్లర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఇక ఆమెతో పాటు నెస్లెన్ కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ చేశాడు.

లోక సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో కొత్త లోక అంటూ రిలీజ్ చేసింది. తెలుగులో కూడా కొత్త లోక సినిమాకు మంచి టాక్ వచ్చింది. మలయాళంలోనే కాదు అన్ని తెలుగులో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త లోక చాప్టర్ 1 చంద్ర సర్ ప్రైజింగ్ హిట్ అందుకుంది. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News