అస్సాం బ్యూటీకి అలా కలిసొచ్చింది!
టైర్ 2, టైర్ 3 హీరోలకు పర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుందని విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. అక్కడ నుంచి స్టార్ లీగ్ లో చేరడానికి పెద్దగా సమయం పట్టదన్నారు.;
`డ్రాగన్` విజయంతో అస్సాం బ్యూటీ కయాదు లోహర్ తెలుగింట ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. తమిళ అనువాద చిత్రంతోనే తెలుగు యువత మనసు దోచుకుంది. అందం, అభినయమే అంతకు మించిన క్వాలిటీ కయాదులో ఉన్నాదనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ రెట్టింపు అయింది. ఇంత ఫేమస్ అయిన బ్యూటీకి తెలుగులో బిజీ అవ్వడం ఖాయమన్నారు. టైర్ 2, టైర్ 3 హీరోలకు పర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుందని విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. అక్కడ నుంచి స్టార్ లీగ్ లో చేరడానికి పెద్దగా సమయం పట్టదన్నారు.
మరి ప్రయాణం టాలీవుడ్ లో ఆ రకంగా సాగుతుందా? అంటే ఎంత మాత్రం కాదనే చెప్పాలి. `డ్రాగన్` తర్వాతతర్వాత కయాదు తెలుగులో కమిట్ అయింది రెండు సినిమాలే. `ఫంకీ`, `ది ప్యారడైజ్` చిత్రాలకు ఒకే చెప్పింది. ఆ తర్వాత మరే కొత్తే సినిమాకు సైన్ చేయలేదు. అయితే టాలీవుడ్ ఇమేజ్ తో తమిళ, మలయాళ భాషల్లో మాత్రం పుల్ బిజీ అయింది. తమిళ్ లో నాలుగు సినిమాలు చేస్తుండగా, మలయాళంలో మూడు సినిమాలు చేస్తోంది. అవన్నీ ఆన్ సెట్స్ లో ఉన్నాయి. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ లు.
ఈ నేపథ్యంలో 2026 లో యువ భామల్లో కయాదు హవా ఆ రెండు పరిశ్రమల్లో హైలైట్ అవుతుంది. ఇవి గాక మాలీవుడ్ లో రెండు..తమిళ్ లో మరో మూడు సినిమాలకు కూడా సైన్ చేసిందన్నది తాజా సమాచారం. తెలుగులో నటిస్తోన్న `ఫంకీ`, `ది ప్యారడైజ్` కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాలే. వాటిలో `ప్యారడైజ్` పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే కయాదు టాలీవుడ్ కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకునే అవకాశాలున్నాయి. ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాతో సక్సస్ అందుకుంటే వచ్చే గుర్తింపు యూనిక్ గా ఉంటుంది.
రీజనల్ సినిమాల్లో అవకాశాలకు ఆ విజయం దారి తీస్తుంది. సక్సెస్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది. అయితే ఈ బ్యూటీ తొలుత లాంచ్ అయింది మాత్రం కన్నడ పరిశ్రమలో. `మెగిలిపెట్టే` అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత అక్కడ కొనసాగలేదు. మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ చిత్రాలకే ప్రాధాతన్యత ఇచ్చింది. అటుపై ఏడాది అనంతరం `అల్లూరి` అనే ఓ తెలుగు సినిమాలో కూడా నటించింది. కానీ ఆచిత్రం గురించి పెద్దగా ఎవరికీ తెలియ కపోడంతో? కయాదు నటించిందా? అన్నది ఇప్పటికీ చాలా మందికి తెలియదు.