విదేశాలకు వెళ్లనున్న తారక్.. ఎందుకంటే
డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడుతున్నారు. తన కెరీర్లో మునుపెన్నడూ లేనంత స్లిమ్ గా తారక్ ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యారు.;
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దేవరతో మరో హిట్ ను అందుకున్న తారక్, రీసెంట్ గా వార్2 సినిమాలో నటించి బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు. బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమాతో సూపర్‌హిట్ ను అందుకుంటారని అందరూ అనుకున్నారు కానీ వార్2 అంచనాలను అందుకోలేకపోయింది.
ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ డ్రాగన్
వార్2 అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయినప్పటికీ ఆ సినిమాతో ఎన్టీఆర్ కు నార్త్ లో మంచి మార్కెట్ మాత్రం ఏర్పడింది. ఇదిలా ఉంటే తారక్ ప్రస్తుతం కెజిఎఫ్, సలార్ లాంటి సినిమాలతో కేవలం బ్లాక్ బస్టర్లను అందుకోవడమే కాకుండా ఆ సినిమాలతో రికార్డులను సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
డ్రాగన్ కోసం స్లిమ్ గా మారిన తారక్
డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడుతున్నారు. తన కెరీర్లో మునుపెన్నడూ లేనంత స్లిమ్ గా తారక్ ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యారు. అటు ప్రశాంత్ నీల్ కూడా తారక్ ను చాలా కొత్తగా చూపించాలని, డ్రాగన్ లో ఎన్టీఆర్ ను సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఎన్టీఆర్, నీల్ ఇద్దరికీ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో పాటూ తారక్ ఈ సినిమాకు భారీగా కష్టపడుతుండటం ఆడియన్స్ కు డ్రాగన్ పై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. డ్రాగన్ కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ నవంబర్ మూడో వారం నుంచి యూరప్ లో జరగనుందని తెలుస్తోంది. ఆల్రెడీ దానికి సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ చేస్తున్నారని సమాచారం. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జూన్ లో డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.