• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దీపావళి ఫైట్.. ఆ ముగ్గురి...

దీపావళి ఫైట్.. ఆ ముగ్గురి మధ్యలోనే

| కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దీపావళికి ప్రతిసారి స్టార్ హీరోల సినిమాలు రావడం ఆనవాయితీగా వస్తోంది

By - Tupaki Desk
Update: 2024-10-05 12:30 GMT

కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దీపావళికి ప్రతిసారి స్టార్ హీరోల సినిమాలు రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత రెండు, మూడేళ్ళ నుంచి చూసుకుంటే చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు దీపావళి కానుకగా థియేటర్స్ లోకి రావడం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘అన్నాత్తై’ సినిమా 2021లో దీపావళి కనుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత నుంచి తమిళ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోల సినిమాలు దీపావళి రేసులో పోటీ పడలేదు.

ఎక్కువగా టైర్ 2 హీరోల సినిమాలు మాత్రమే దీపావళికి సందడి చేస్తున్నాయి. 2024లో కూడా దీపావళికి కోలీవుడ్ నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి. ఈ మూడింటిలో ఒకటి కూడా స్టార్ హీరో సినిమా కాదు. శివకార్తికేయన్ ‘అమరన్’ సినిమాతో దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అవుతోంది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో పవర్ఫుల్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ గా‘అమరన్’ మూవీ తెరకెక్కింది. సినిమాపైన భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి.

తమిళ్, తెలుగు భాషలలో ఏకకాలంలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. సాయి పల్లవి ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కి జోడీగా నటించింది. మరోవైపు జయం రవి హీరోగా రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రదర్’ మూవీ అక్టోబర్ 31న థియేటర్స్ లోకి రాబోతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో జయం రవికి జోడీగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటించింది. వీటి తో పాటు కెవిన్ హీరోగా తెరకెక్కిన ‘బ్లడీ బెగ్గర్’ కూడా దీపావళికి రిలీజ్ కాబోతోంది.

ఈ మూడు మీడియం బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. వీటన్నింటిలో ‘అమరన్’ సినిమాపైన ఎక్కువ బజ్ ఉంది. ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం కావడంతో కచ్చితంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం ఐదు భాషలలో రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్ ని అన్ని భాషలలో మంచి ఇమేజ్ ఉన్న నేపథ్యంలో సినిమాకి కచ్చితంగా ఆదరణ వస్తుందని భావిస్తున్నారు. తమిళంలో కూడా దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ మూవీ ఆకట్టుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

Tags:    
  • Shivakarthikeyan 
  • Amaranmovie 
  • Jayamravi 
  • Brothermovie 
  • Bloodybeggar 
  • Luckybhaskar 
  • Filmindustry 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS