• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వక్ 'మెకానిక్ రాకీ'.....

విశ్వక్ 'మెకానిక్ రాకీ'.. ట్విస్టులే అసలు భలం

| ఇప్పుడు మరో మూవీ మెకానిక్ రాకీతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-21 10:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాదిలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మరో మూవీ మెకానిక్ రాకీతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా నవంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. నేడు యూఎస్ లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన ఆ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎస్‌ ఆర్‌ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ కానున్న మెకానికి రాకీపై ఇప్పటికే ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్రేజీ బజ్ క్రియేట్ చేశారు. కామెడీ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ట్రైలర్ 1.0.. ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయిన ట్రైలర్ 2.0తో అంచనాలు పెంచేశారు.

కానీ మేకర్స్ మాత్రం కథను అస్సలు రివీల్ చేయలేదు. అదే సమయంలో మెకానిక్ రాకీ రొటీన్ ఎంటర్టైనింగ్ మూవీస్ కు భిన్నంగా ఉంటుందని డైరెక్టర్ రవితేజ పలుమార్లు తెలిపారు. సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని హామీ ఇచ్చారు. హీరో విశ్వక్ కూడా థ్రిల్స్‌ తో నిండిన ఎమోషనల్ రోలర్‌ కోస్టర్ రైడ్‌ గా సినిమా సాగుతుందని తెలిపారు. కీలకమైన ట్విస్ట్ తర్వాత కథ సరికొత్త దిశలో సాగుతుందని అన్నారు.

ట్రైలర్స్ లో కథ రివీల్ చేయలేదని, అసలైన స్టోరీ సినిమాలో చూడాలని చెప్పారు. ఇలాంటి సరికొత్త కథతో సినిమా చేస్తారా అని తాను ఒకానొక టైమ్ లో షాక్ అయ్యానని తెలిపారు. డైరెక్టర్ చాలా స్మార్ట్ అని కొనియాడారు. మూవీలో చాలా ట్విస్టులు ఉన్నాయని తెలిపారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్.. థియేటర్స్ లోని సీట్లకు అతుక్కుపోతారని ధీమా వ్యక్తం చేశారు.

హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆ ట్విస్టులు ఏంటనేవి ఇప్పుడు సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మూవీ అదిరిపోయే రీతిలో అలరించి.. మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ట్విస్టులే సినిమాను హిట్ గా మార్చే ఛాన్స్ కనిపిస్తుందని అంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Gaani 
  • Gangsofgodavari 
  • Mechanicrocky 
  • Promotions 
  • Vishwaksen 
  • Meenakshichaudhary 
  • Shraddhasrinath 
  • Raviteja 
  • Comments 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS