రాజు గారి సీక్వెల్ సినిమా సంగతి ఏంటి..?

ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో మొదలవ్వాల్సిన ఎల్లమ్మ అసలు మొదలు కాలేదు. ఆ సినిమా కాస్టింగ్ విషయంలో జరుగుతున్న డిస్కషన్స్ తెలిసిందే.;

Update: 2025-12-07 05:28 GMT

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ లో సినిమాలను ఈమధ్య బాగా తగ్గించారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్, స్మాల్ బడ్జెట్ సినిమాలను కూడా చేస్తూ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఎస్.వి.సీ బ్యానర్ రెండు దశాబ్దాల కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా కాస్త తడబాటులో ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన సినిమాల విషయంలో కాస్త క్లారిటీ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది.

దిల్ రాజు నిర్మాణంలో మొదలవ్వాల్సిన ఎల్లమ్మ..

ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో మొదలవ్వాల్సిన ఎల్లమ్మ అసలు మొదలు కాలేదు. ఆ సినిమా కాస్టింగ్ విషయంలో జరుగుతున్న డిస్కషన్స్ తెలిసిందే. మరోపక్క ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ సినిమా అనౌన్స్ చేశారు దిల్ రాజు. దాదాపు అది అనౌన్స్ చేసి ఏడాది కావొస్తున్నా ఇప్పటివరకు ఆ సినిమా ఊసే ఎత్తట్లేదు. 2017 లో SVC బ్యానర్ నుంచి వచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ శతమానం భవతి. సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ లీడ్ రోల్స్ చేయగా ప్రకాష్ రాజ్, జయసుధ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు.

2017 సంక్రాంతికి వచ్చి ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఐతే ఆ సినిమాపై ఆడియన్స్ చూపించిన ప్రేమకు శతమానం భవతి పార్ట్ 2 ఉంటుందని అనౌన్స్ చేశారు దిల్ రాజు. 2026 సంక్రాంతికి సినిమా రిలీజ్ అని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్టు కూడా తెలియదు. శతమానం భవతి సీక్వెల్ లో శర్వానంద్, అనుపమ నటిస్తారన్న క్లారిటీ లేదు.

సీక్వెల్ ప్రయత్నాన్ని దిల్ రాజు వెనక్కి తీసుకున్నారా..

సతీష్ వేగేశ్న ని కూడా తప్పించి ఈ సీక్వెల్ లో మరో దర్శకుడిని తీసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తై సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే అనేలా చెప్పారు. కానీ శతమానం భవతి 2 గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. బహుశా ఆ సీక్వెల్ ప్రయత్నాన్ని దిల్ రాజు వెనక్కి తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈమధ్య ఆడియన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది.

సీక్వెల్ సినిమాల్లో కూడా మరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటే తప్ప యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే దిల్ రాజు శతమానం భవతి 2 విషయంలో సైలెంట్ గా ఉన్నారనిపిస్తుంది. మరి దిల్ రాజు నిజంగానే ఆ సినిమా ఆపేస్తున్నారా లేదా మరో ప్లాన్ ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. దిల్ రాజు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఎల్లమ్మని కూడా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.

Tags:    

Similar News