గేమ్ ఛేంజర్ తర్వాత.. దిల్ రాజు బిగ్ గేమ్!

అయితే గత ఏడాది దిల్ రాజుకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి! ముందుగా సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీతో డిజాస్టర్ మూటగట్టుకున్నారు.;

Update: 2026-01-25 22:30 GMT

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే కెరీర్ లో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్స్ హిట్లు అందుకున్న ఆయన.. డిస్ట్రిబ్యూటర్ గా తన సత్తా ఏంటో అనేక సార్లు పలు చిత్రాలతో చూపించారు. అలా అటు సినిమాలు నిర్మిస్తూనే.. ఇటు డిస్ట్రిబ్యూట్ చేస్తూ.. దిల్ రాజు బిజీగా ఉంటారు. ఎప్పుడూ తనదైన ప్లాన్ తో ముందుకెళ్తుంటారని చెప్పాలి.

అయితే గత ఏడాది దిల్ రాజుకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి! ముందుగా సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీతో డిజాస్టర్ మూటగట్టుకున్నారు. హెవీ బడ్జెట్ తో రూపొందిన ఆ మూవీ.. భారీ నష్టాలు మిగిల్చింది. కానీ అదే పొంగల్ కు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బిగ్ రిలీఫ్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచిన ఆ సినిమా.. దిల్ రాజుకు మంచి లాభాలు అందించింది.

కానీ ఆ తర్వాత దిల్ రాజు రిలీజ్ చేసిన వివిధ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మళ్లీ నిరాశపరిచాయి. ఆర్థికంగా లాభాలు కూడా తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు ఆయన 2026లో మాత్రం బిగ్గెస్ట్ ప్లాన్ తో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి భారీ లాభాలు అందుకున్నారు దిల్ రాజు. ఆయన నిర్మించిన సినిమాలేం రిలీజ్ కాకపోయినా.. డిస్ట్రిబ్యూటర్ గా హిట్స్ అందుకున్నారు.

మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలను నైజాం, వైజాగ్ ఏరియాల్లో రిలీజ్ చేసి మంచి లాభాలు సాధించారు. అదే సమయంలో ఇప్పుడు నిర్మాతగా పలు భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు చిత్రాలను నిర్మిస్తున్న దిల్ రాజు.. బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టు స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో చూసుకుంటే విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్ లో రూపొందుతున్న రౌడీ జనార్ధన్ సినిమాను దిల్ రాజు.. దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ లీడ్ రోల్ లో వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ మూవీని రూ.50 కోట్లకుపైగా బడ్జెట్ తో తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ రెండింటితోపాటు మరిన్ని సినిమాలను లైన్ లో పెట్టినట్లు సమాచారం. త్వరలో ఆ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. మరోవైపు, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తెలుగు వెర్షన్ కన్నా ఎక్కువ బడ్జెట్ అవ్వనుందని వినికిడి. దాంతోపాటు సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమాను భారీ వ్యయంతో ఓ సినిమా రూపొందించనున్నారని టాక్ వస్తోంది. ఏదేమైనా ఇప్పుడు బిగ్ గేమ్ తో రంగంలోకి దిగుతున్న దిల్ రాజు.. ఎలాంటి హిట్స్ ను అందుకుంటారో అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News