• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డిజిటల్ లో సౌత్ స్టార్…...

డిజిటల్ లో సౌత్ స్టార్… సక్సెస్ మాత్రం ఇద్దరికే

| కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. హర్రర్ జోనర్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా మెప్పించలేదు

By - Tupaki Desk
Update: 2024-08-09 13:30 GMT

గత రెండు దశాబ్దాల కాలం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన అందాల భామలు చూసుకుంటే త్రిష, శ్రియ శరణ్, నయనతార, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, సమంత, శృతి హాసన్ కనిపిస్తారు. వీరు మెజారిటీగా స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. అలాగే సౌత్ అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్స్ గా కూడా ఒకానొక దశలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి నయనతార స్టార్ హీరోయిన్ గా తన ఇమేజ్ ని కొనసాగిస్తోంది.

త్రిష అయితే రెండు దశాబ్దాల తర్వాత ఫేడ్ అవుట్ అయ్యే స్టేజ్ నుంచి మళ్ళీ లీడింగ్ యాక్టర్ గా మారింది. వీరిలో ఒక్క నయనతార తప్ప మిగిలిన స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. వెబ్ సిరీస్ లలో నటించి సత్తా చాటే ప్రయత్నం చేశారు. వీరందరిలో అత్యధికంగా తమన్నా నాలుగు వెబ్ సిరీస్ లు చేసింది. అవి 11వ అవర్, నవంబర్ స్టోరీ, జీ కర్దా, ఆఖ్రీ సచ్. వీటిలో 11వ అవర్ కొంత పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న మిగిలిన వెబ్ సిరీస్ మాత్రం ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు.

కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. హర్రర్ జోనర్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా మెప్పించలేదు. అలాగే శ్రియ శరణ్ షో టైం వెబ్ సిరీస్ లో నటించింది. ఇది ఎవరికి పెద్దగా కనెక్ట్ కాలేదు. శృతి హాసన్ బెస్ట్ సెల్లర్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా వ్యూవర్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో పాటు సమంత పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఆమె సెకండ్ వెబ్ సిరీస్ సిటాడెల్ నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఇక స్టార్ హీరోయిన్ త్రిష బృంద అనే వెబ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోనీ లీవ్ లో కొద్దిరోజుల క్రితం ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. దీనికి థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి మంచి స్పందన వస్తోంది. ఇదే ఊపులో త్రిష మరికొన్ని వెబ్ సిరీస్ కథలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

సినిమాలలో అవకాశాలు రాని బ్యూటీస్ కి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లలో వెబ్ సిరీస్ లు మంచి ఛాయస్ గా మారాయి. చాలా మంది భామలు వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే కొందరికి వెంటవెంటనే సక్సెస్ లు లభిస్తున్నాయి. నిత్యా మీనన్ కూడా ఇప్పటికే కుమారి శ్రీమతి, మాస్టర్ పీస్, బ్రీత్ , మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది.

Tags:    
  • Kajalaggarwal 
  • Livetelecast 
  • Samantha 
  • Thefamilyman 
  • Trisha 
  • Brindaseries 
  • Shriyasaran 
  • Showtimeseries 
  • Webseries 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS