దురంధర్ మీమ్స్.. కడుపు చెక్కలే

దురంధర్.. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచే దిశగా దూసుకెళ్తున్న చిత్రం.;

Update: 2025-12-17 03:15 GMT

దురంధర్.. బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచే దిశగా దూసుకెళ్తున్న చిత్రం. ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ చేశాడు. రెండో వారంలోనూ అదిరిపోయే వసూళ్లతో సాగుతోందీ చిత్రం. ఇది పాకిస్థాన్‌లో స్పైగా పని చేసే ఇండియన్ సోల్జర్ కథ.

దురంధర్.. చాలా సీరియస్‌గా, ఇంటెన్స్‌గా సాగే సినిమా ఇది. అలాంటి సినిమా మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ చూస్తే కడుపు చెక్కలవడం ఖాయం. సీరియస్ కాన్సెప్ట్ మీద ఫన్నీ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు నెటిజన్లు. ‘First day in pakistan as Indian spy’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ మీమ్స్ చేస్తున్నారు. సినిమాలో రణ్వీర్‌ను పాకిస్థాన్ వాళ్లు పరీక్షించే సీన్ ఒకటి ఉంటుంది. దాని స్ఫూర్తితో ఈ మీమ్ వీడియోలు చేస్తున్నారు. సినిమాలో హీరో పాకిస్థాన్ వాళ్లు పెట్టే పరీక్షలన్నీ తట్టుకుని అక్కడి వాళ్లతో కలిసిపోయి మిషన్ నడిపిస్తాడు. ఐతే సరిగా ప్రిపేరవకుండా వెళ్లి అలవాటులో పొరపాటుగా తప్పులు చేసి దొరికిపోతే ఏంటి పరిస్థితి అనే కోణంలో ఈ మీమ్ వీడియోలు చేస్తున్నారు.

నీ పేరేంటి.. ఊరేంటి.. అని చకచకా ప్రశ్నలు అడుగుతుంటే.. పొరపాటున ఏదైనా జవాబు తేడా కొడితే.. వెంటనే ఆ వ్యక్తి ఫొటోకు దండ పడిపోయేట్లుగా ఈ మీమ్స్ చేస్తున్నారు. ఈ వీడియోల విషయంలో జనాల క్రియేటివిటీ మామూలుగా లేదు. కొత్త కొత్త ఐడియాలతో హిలేరియస్‌గా రూపొందిస్తున్న ఈ మీమ్స్‌ చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం.

వీటికి కొనసాగింపుగా ఇండియాకు పాకిస్థాన్ స్పైలు వస్తే ఏంటి పరిస్థితి అనే నేపథ్యంలోనూ మీమ్స్ చేస్తున్నారు అవి కూడా ఫన్నీగా ఉంటున్నాయి. సీరియస్ సినిమా మీద ఇలాంటి ఫన్నీ మీమ్స్ రావడం ఆశ్చర్యమే కానీ.. అవి కూడా సినిమా ప్రమోషన్‌కు బాగానే ఉపయోగపడుతున్నాయి. ‘దురంధర్’ ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News