ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ధురంధర్ 2.. ఆడియన్స్ కి ఫుల్ మీల్స్

ప్రముఖ డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా .. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ధురంధర్.

Update: 2026-05-15 05:28 GMT

ప్రముఖ డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా .. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ధురంధర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతాకాదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకి కొనసాగింపుగా.. మార్చి 19వ తేదీన ధురంధర్ 2 అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా అంతకుమించి కలెక్షన్స్ వసూలు చేసింది.. సుమారుగా రూ.1900 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇండియాలోనే కాకుండా విదేశీ పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాలలో కూడా ఈ సినిమా సత్తా చాటింది.

అలాంటి ఈ సినిమా కోసం దేశీయంగానే కాకుండా విదేశీ ప్రియులు కూడా మంత్రముగ్ధులయ్యారు. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతగానో ఎదురు చూశారు..ఇక ఎదురుచూపుకు తెరదించుతూ.. ఎట్టకేలకు ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ అసలు ట్విస్ట్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ల మధ్య విభజన జరిగింది. ముఖ్యంగా విదేశీ ఓటీటీ హక్కులను బడా ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మన ఇండియాలో జియో హాట్ స్టార్ దక్కించుకుంది.

ఇక్కడ సర్ప్రైజ్ ఏమిటంటే థియేటర్లలో చూడని సన్నివేశాలను కూడా కలిపి ఇక్కడ "రా అండ్ ఉండేఖా "అనే ట్యాగ్ లైన్ తో సుమారుగా 3 గంటల 52 నిమిషాల సుదీర్ఘ అన్ కట్ వెర్షన్ ను విడుదల చేసింది. దీనితో ఇంటర్నేషనల్ ఆడియన్స్ లో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకున్నప్పటికీ.. ఇండియాలో మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ ను ఇంకా ప్రారంభించలేదు. దీనికి రెండు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఐపీఎల్ ప్రసారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక భారీ సినిమాను విడుదల చేస్తే వ్యూయర్ షిప్ తగ్గే అవకాశం ఉంది. అందుకే ఐపీఎల్ హడావిడి తగ్గాకే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఓటీటీ ప్లాట్ఫామ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు అటు బాక్సాఫీస్ వద్ద ఇంకా నిలకడగా వసూల్ వస్తుండడంతో థియేటర్ రన్ పూర్తిస్థాయిలో ముగుసే వరకు ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు అన్ కట్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. అటు విదేశీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ పరంగా ఇండియాలో ఎప్పుడు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుందో చూడాలి. రణవీర్ సింగ్, సారా అర్జున్ , సంజయ్ దత్ , ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Tags:    

Similar News