రక్తం చేతులతో యష్.. ఏం చెప్పాలనుకుంటున్నాడు?

కేవిఎన్ ప్రొడక్షన్స్, మోన్స్ టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Update: 2026-07-26 08:36 GMT

KGF సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ఈ సందర్భంగా సినిమా నుంచి ఒక ఇంటెన్స్ అండ్ రా పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

బ్లాక్, వైట్, డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ షేడ్స్ లో డిజైన్ చేసిన ఈ పోస్టర్ చాలా విభిన్నంగా కనిపిస్తోంది. ఇందులో యష్ తెల్లటి షర్ట్ ధరించి, రక్తం ఓడుతున్న చేతులతో చాలా ప్రశాంతంగా సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. ఆయన వేళ్ల నుంచి రక్తం బొట్లు బొట్లుగా కిందకు కారుతుండటం పోస్టర్‌కు ఒక రకమైన డార్క్ వైబ్‌ను తెచ్చిపెట్టింది. సిగరెట్ పొగలో సరిగ్గా కనిపించకుండా మిస్టరీగా డిజైన్ చేయడం ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది.

ఈ పోస్టర్ డిజైన్ చూస్తుంటే సినిమాలో విపరీతమైన యాక్షన్ తో పాటు సైకలాజికల్, ఎమోషనల్ యాంగిల్ కూడా చాలా బలంగా ఉండబోతోందని అర్థమవుతుంది. వైలన్స్ మాత్రమే కాకుండా పాత్రలోని ఇంటెన్సిటీని, వైవిధ్యమైన షేడ్స్ ని ఈ విజువల్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. దర్శకురాలు గీతు మోహన్ దాస్ టేకింగ్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన స్టైల్ తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. యష్ లుక్ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది.

కేవిఎన్ ప్రొడక్షన్స్, మోన్స్ టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యష్ గ్లోబల్ మార్కెట్ కి తగ్గట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ని మెప్పించేలా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో మేకింగ్ సాగుతోంది. సినిమా కథకు సంబంధించిన పూర్తి వివరాలను ఎక్కడా బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. కేవలం ఇలాంటి రా పోస్టర్లతోనే అంచనాలను బ్యాలెన్స్డ్‌గా పెంచుతూ రావడం మేకర్స్ ప్రమోషనల్ ప్లానింగ్‌ అనిపిస్తోంది.

సినిమా ఇంకా నెల రోజుల్లో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఓపెనింగ్స్ సాధించేలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. కేజియఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో బిజినెస్ పరంగా కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. రాబోయే రోజుల్లో ప్రమోషన్లు మరిన్ని పెంచి సినిమాను ఆడియన్స్ లోకి బలంగా తీసుకెళ్లాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఓవరాల్‌గా ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఉన్న హైప్‌ని కాపాడేలా, క్రేజ్ ను మరింత పెంచేలా ఉంది. మేకర్స్ రాబోయే రోజుల్లో ఎలాంటి కథనంతో ముందుకు రాబోతున్నారో, ఎలాంటి ట్రైలర్ ను కట్ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 26న రిలీజ్ కానున్న ఈ టాక్సిక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో, ఏ రేంజ్ లో ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Tags:    

Similar News