ధురంధర్ 2.. అల్లు అర్జున్, మహేష్.. ఏంటీ కథ?

ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;

Update: 2026-03-24 18:09 GMT

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ఆ స్పై థ్రిల్లర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్ల వసూళ్లు సాధించి, త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌ లోకి చేరే దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల ధురంధర్ 2 సక్సెస్ సెలబ్రేషన్స్ పేరుతో ఒక ఫోటో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో ముంబైలోని ఓ హైఎండ్ నైట్‌ క్లబ్‌ లో జరిగిన పార్టీగా చూపిస్తూ పలువురు ప్రముఖులు ఒకేచోట కనిపించడం విశేషం. దర్శకుడు ఆదిత్య ధర్‌ తో పాటు యామి గౌతమ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి బాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు.

అదే ఫోటోలో టాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు కనిపించడం అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా పలువురు ఒకేచోట కనిపిస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఆ సీన్ చూసిన అభిమానులు ఇది నిజమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.

ఆ ఫోటోలో బయట నిల్చున్నట్టు చూపిస్తూ ఆలియా భట్, కరణ్ జోహర్, ధ్రువ్ రాథీ, దీపికా పదుకొనే, ఆదిత్య చోప్రా కనిపించడం చర్చనీయాంశమైంది. ఇంతమంది ప్రముఖులు ఒకే వేడుకలో, అదే సమయంలో ఉండటం నిజంగా సాధ్యమేనా అన్న సందేహం నెటిజన్లలో కలుగుతోంది. తర్వాత వెలుగులోకి వచ్చిన విషయమే అసలు క్లారిటీ ఇచ్చింది. ఈ ఫోటో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తో రూపొందించినదని, ఫన్ కోసమే క్రియేట్ చేసిందని తెలిసింది.

ఎలాంటి తప్పుదారి పట్టించే ఉద్దేశం లేదని కూడా క్రియేటర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆ ఏఐ ఐడియా మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఆ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్- టాలీవుడ్ మల్టీస్టారర్ సెలబ్రేషన్ ఇదేనా! అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఇలాంటి ఈవెంట్ నిజంగా జరిగితే ఎలా ఉంటుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. ధురంధర్ 2 విడుదలైన నాటి నుంచి మంచి వసూళ్లు నమోదు చేస్తోంది. కథ, యాక్షన్ సన్నివేశాలు, రణవీర్ సింగ్ నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుసగా కలెక్షన్లు పెరుగుతుండటంతో ఆ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ధురంధర్ 2 విజయంతో పాటు ఏఐ వైరల్ ఫోటో కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు టెక్నాలజీ ఎఫెక్ట్ ఎలా పెరుగుతుందో చూపిస్తున్న ఆ ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News