సినిమా ఆత్మనే చంపేస్తున్నారు.. రాంఝనా AI క్లైమాక్స్ పై ధనుష్ అసహనం!

ఈ క్రమంలోనే ఇదే విషయంపై తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.;

Update: 2025-08-04 04:45 GMT

టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత.. ఎక్కువగా సహజంగా ఉండాల్సిన సన్నివేశాలను కూడా ఏఐ టూల్స్ తో రూపొందించడం నిజంగా అత్యంత దారుణం అని పలువురు వాపోతున్నారు. సినిమాలలో ఏఐ వాడకంపై ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ టెక్నాలజీలు వచ్చిన తర్వాత సహజత్వానికి ప్రాణం లేకుండా చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


రాంఝనా ఏఐ క్లైమాక్స్ పై ధనుష్ అసహనం..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చ జరుగుతోంది. దాదాపు అన్నింటిలో కూడా ఏఐని ఎక్కువగా వాడేస్తున్నారు. ఏఐ వాడకంతో ఘననీయంగా మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాలలో ఏఐ వాడకంపై అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా 'రాంఝనా' సినిమా క్లైమాక్స్ కు సంబంధించి ఏఐ వాడకం పై సినీ నటుడు ధనుష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా.. ఒక నోట్ విడుదల చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో రూపొందించిన క్లైమాక్స్ తో రాంఝనా సినిమాను రీ రిలీజ్ చేయడం నన్ను కలతకు గురిచేసింది. ఇది సినిమా ఆత్మనే కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏఐ వినియోగానికి నేను అభ్యంతరం వ్యక్తం చేసినా సంబంధిత పార్టీలు మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లాయి.. క్లైమాక్స్ మార్చి అటు దారుణంగా అవమానించారు అంటూ ధనుష్ సీరియస్ అయ్యారు.

ఏఐ వాడకం సినిమా ఆత్మనే దెబ్బతీస్తుంది - ధనుష్

దాదాపు 12 సంవత్సరాల క్రితం తాను కమిట్ అయిన సినిమా ఇది కాదు అని తెలిపిన ఆయన.. సినిమాల్లో కంటెంట్ ను మార్చడానికి ఏఐని ఉపయోగించడం వల్ల కళ, కళాకారులు ఇద్దరికీ తీవ్ర నష్టం కలిగించే అంశమని వాపోయారు. ముఖ్యంగా ఈ ఏఐ వాడకం అనేది కథ చెప్పే విధానానికి, సినిమా వారసత్వానికి అత్యంత ప్రమాదకరమని భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులను నివారించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలి అని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ధనుష్ చేసిన ఈ పోస్టు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

రాంఝనా రీ రిలీజ్ క్లైమాక్స్ నే మార్చేసిన AI..

ఇకపోతే అంబికాపతి పేరుతో రాంఝనా సినిమా తమిళ్ వెర్షన్ ఆగస్టు ఒకటిన థియేటర్లలో రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో క్లైమాక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రత్యామ్నాయ సంతోషకరమైన ముగింపును ఇందులో క్రియేట్ చేశారు. ఈ ఏఐ జనరేటర్ ముగింపులో ధనుష్ పాత్ర కుందన్ ను సజీవంగా చూసి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ఏఐ మార్పుతో సంతోషంలో నెటిజన్స్..

దీనికి తోడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.. క్లైమాక్స్ తో సినిమా మరింత అందంగా మారింది. వాస్తవికంగా ఉంది. ధనుష్ సజీవంగా ఉండడం మరింత సంతోషంగా ఉంది. అభిమానులు ఎల్లప్పుడూ కోరుకునే ముగింపును ఏఐ ఇచ్చింది అని కొంతమంది అభిప్రాయపడ్డారు.

ధనుష్ ఆవేదన వారి కోసమేనా?

అయితే హీరో ధనుష్ మాత్రం సినీ పరిశ్రమ, సినీ కళాకారులను దృష్టిలో పెట్టుకొని.. జరగబోయే నష్టాన్ని ముందుగానే గ్రహించి అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కళామతల్లి బ్రతకాలి అంటే కళాకారులకు పని దొరకాలి.. ఇలాంటి ఏఐ టెక్నాలజీల వల్ల వారికి పని లేకుండా పోతుంది.. అనే ఉద్దేశంతోనే ధనుష్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News