#గుస‌గుస‌.. వేలెంటైన్స్ డే రోజు పెళ్లాడ‌తారంటూ..!

అందాల క‌థానాయిక మృణాల్ ఠాకూర్ - ధనుష్ మధ్య ప్రేమాయణం గురించి చాలా కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి.;

Update: 2026-01-16 13:31 GMT

అందాల క‌థానాయిక మృణాల్ ఠాకూర్ - ధనుష్ మధ్య ప్రేమాయణం గురించి చాలా కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఏడాదిన్న‌ర కాలంగా మృణాల్ తో ముడిపెడుతూ ధ‌నుష్ గురించి ఈ త‌ర‌హా ప్ర‌చారం సాగుతోంది. అత‌డు మృణాల్ కోసం ఓ సినిమా స‌క్సెస్ మీట్‌కి కూడా వెళ్ల‌డం చ‌ర్చ‌గా మారింది. మృణాల్ కోస‌మే త‌న‌కు సంబంధం లేని స‌క్సెస్ వేడుక‌కు వెళ్లాడ‌ని మాట్లాడుకున్నారు. అయితే మృణాల్ డేటింగ్ ఊహాగానాల‌ను ఖండించింది. ధనుష్‌ను ఒక స్నేహితుడు మాత్ర‌మేన‌ని ప్రస్తావించింది.

తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ ఇద్దరూ ఫిబ్రవరి 14న వివాహం చేసుకోవాలని యోచిస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. వేలెంటైన్స్ డేని ఈ జంట స్పెష‌ల్ గా మార్చాల‌ని భావిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వివాహం జరుగుతుందని భావిస్తున్నారు.

అయితే దీనిపై ధనుష్ లేదా మృణాల్ ఠాకూర్ స్పందించలేదు. ఈ వార్తలపై ఆ ఇద్ద‌రికి చెందిన మేనేజ‌ర్లు కూడా స్పందించ‌లేదు. ఇలాంటి అన‌వ‌స‌ర‌మైన ప్ర‌చారానికి అంత‌గా ప్రాధాన్య‌త‌నివ్వ‌కూడ‌ద‌ని వారు భావించిన‌ట్టు కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

కొన్ని హిందీ వెబ్ సైట్లు అదే ప‌నిగా ఇలాంటి ఫేక్ క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నాయ‌ని ధ‌నుష్ అభిమానులు భావిస్తున్నారు. గత ఏడాది ఆగ‌స్టులో మృణాల్ నటించిన `సన్ ఆఫ్ సర్దార్ 2` ప్రీమియర్ షోకు ధనుష్ హాజరైనప్పటి నుండి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం బ‌హిరంగంగా ఇప్ప‌టికీ అలానే కొన‌సాగుతోంది. సోష‌ల్ మీడియాల్లోను ఒక‌రినొక‌రు అనుస‌రిస్తున్నారు.

మ‌రోవైపు ధ‌నుష్, మృణాల్ కెరీర్ విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉన్నారు. ధనుష్ తన తదుపరి చిత్రాలతో D53, D54 బిజీగా ఉండ‌గా, మృణాల్ మూడు భాష‌ల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ , టాలీవుడ్, కోలీవుడ్ లో వ‌రుస‌గా సంత‌కాలు చేసేందుకు ఆస‌క్తిగా ఉంది. ఉన్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ అధికారికంగా తమ సంబంధం గురించి ఎక్కడా ప్రకటించలేదు. నిజానికి రంగుల ప్ర‌పంచంలో ఇలాంటి పుకార్లు సహజం. నటీనటుల నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వీటిని నమ్మలేము.

Tags:    

Similar News