ఆటపాటలతో పరవశించిపోతున్న విరోష్ జంట.. వీడియో వైరల్!
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడి కంటిన్యూ అవుతుంది.;
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడి కంటిన్యూ అవుతుంది. తాజాగా ఆనంద్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెళ్లి తర్వాత కొత్త జంట విజయ్-రష్మిక, ఆనంద్ మరియు వారి స్నేహితులతో కలిసి ఫుల్ జోష్‌లో స్టెప్పులేస్తున్నారు. ముఖ్యంగా ఆనంద్ కొత్త సినిమాలోని పాటకు వీరంతా కలిసి వేసిన డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'విరోష్' జంట ఆటపాటలతో పరవశించిపోతున్న ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం ..
సంచారమే పాటకు విరోష్ స్టెప్పులు - వైరల్ వీడియో:
ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం 'ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన 'సంచారమే..' అనే పాటకు విజయ్, రష్మిక కలిసి అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ప్రముఖ గీత రచయిత గోరటి వెంకన్న రాసిన "సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందమేమున్నది" అనే పదాలకు తగ్గట్టుగా కొత్త జంట ఎంతో హ్యాపీగా స్టెప్పులేయడం విశేషం. ఈ వీడియోలో ఆనంద్ మరియు వారి మిత్రులు కూడా తోడవ్వడంతో ఆ సందడి రెట్టింపు అయ్యింది. ఆనంద్ దేవరకొండ తన అన్నయ్య, వదినలతో కలిసి చేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ - ఆనంద్ కొత్త ప్రయాణం:
'బేబీ' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'ఎపిక్'పై భారీ అంచనాలు ఉన్నాయి. '90s' వెబ్ సిరీస్‌తో మెప్పించిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆనంద్ గత చిత్రాల కలెక్షన్స్ చూస్తే, 'బేబీ' సినిమా దాదాపు 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ కావడం, దానికి తోడు విజయ్-రష్మికల సపోర్ట్ కూడా తోడవ్వడంతో ఈ సినిమా బిజినెస్ మరియు హైప్ అప్పుడే మొదలైపోయాయి. ఈ పాట సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కూడా ఇలాగే సరదాగా, స్వేచ్ఛగా గడుపుతుండటం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఆనంద్ సినిమా ఇది ఒక రకమైన ప్రమోషన్ లాంటిదే,మరి అన్నయ్య, వదినల మద్దతు లభించడం చిత్ర యూనిట్‌కు పెద్ద ప్లస్ పాయింట్. 'సంచారమే' పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
ఇవే కాక సోషల్ మీడియాలో మెహెందీ వేడుక లకు సంభందించిన ఫోటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. విరోష్ జంట మెహందీ వేడుక కోసం ఈ జంట ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంది. కేవలం వెస్ట్రన్ స్టైల్ కాకుండా, మన దక్షిణాది సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. వీడియోలో కనిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ కూడా చాలా సింపుల్‌గా, క్లాసీగా ఉంది. అత్తగారు బహుమతిగా ఇచ్చిన నగలతో రష్మిక ముస్తాబవ్వడం, విజయ్ పక్కా దేశీ స్టైల్‌లో కనిపించడం చూస్తుంటే ఈ పెళ్లి వేడుకలో ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ప్రేమతో ప్లాన్ చేసుకున్నారని అర్థమవుతోంది. అందుకే నెటిజన్లు కూడా 'నిజమైన మేడ్ ఫర్ ఈచ్ అదర్ జోడీ' అంటూ కామెంట్లు పెడుతున్నారు.