అమ్మ తర్వాత అమ్మగా!
విజయ్ దేవరకొండను పెళ్లాడి దేవరకొండ ఇంట కోడలిగా అడుగుపెట్టింది రష్మిక మందన్న.;
విజయ్ దేవరకొండను పెళ్లాడి దేవరకొండ ఇంట కోడలిగా అడుగుపెట్టింది రష్మిక మందన్న. దీంతో ఇప్పుడా ఆ కుటుంబంలో రష్మిక కీలకమైన వ్యక్తిగా మారిపోయింది. కేవలం విజయ్ భార్యగానే కాకుండా మరిది ఆనంద్ దేవర కొండకు ఒక వదినగా అంతకంటే మిన్నగా తల్లి ఆప్యాయతను పంచే వ్యక్తిగా ఆమె మారిపోయింది.తెలుగు సంప్రయదాయంలో వదిన అంటే అమ్మతో సమానం అనే మాటకు రష్మిక నిలువెత్తు రూపంగా నిలుస్తుందని అభిమానులు చర్చించు కుంటున్నారు. వాస్తవానికి రష్మికకు విజయ్ దేవరకొండ తో వివాహానికి ముందే ఆనంద్ తో మంచి స్నేహం ఉంది.
ఆనంద్ నటించిన పలు చిత్రాల ప్రారంభోత్సవాలకు రష్మిక హాజరై ప్రోత్స హించింది. ఇప్పుడు అధికారికంగా వదిన హోదా రావడంతో? ఆనంద్ కెరీర్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మరిన్ని విలువైన సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్ లో ఆనంద్ నటించే సినిమాల్లో రష్మిక కీలక పాత్రలు పోషించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అమ్మడి ఇమేజ్ విజయ్ సినిమాలకు పని కొస్తుందంటే? మరిది కోసం ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటుంది. విజయ్ ను పెళ్లి చేసుకోక ముందే ఆనంద్ ను ఉద్దేశించి `రేయ్` నువ్వు నా ఫ్యామిలీ రా అంటూ రష్మిక పబ్లిక్ గా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే.
ఆ వ్యాఖ్యలతోనే రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య సీరియస్ లవ్ ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది. కానీ ఆ జంట మాత్రం పెళ్లి ముందు వరకూ గానీ అధికారికంగా వెల్లడించని సంగతి తెలిసిందే. అలాగే వివాహానికి ముందే?
దేవరకొండ కుటుంబ వేడుకల్లో కూడా రష్మిక ఆనంద్‌కు ఇచ్చే ప్రాధాన్యతను నెటిజన్లు ఎంతో దగ్గరగా గమనించారు.అన్నయ్య భార్యగా వచ్చిన రష్మిక ఆనంద్‌కు ఒక స్నేహితురాలిగా, మార్గదర్శిగా ఉంటూనే తల్లి లోటును తీర్చే వదినమ్మగా తన బాధ్యతను నెరవేరుస్తోంది. ఈ విషయంలో తానో పెద్ద స్టార్ అనే భావన ఎంత మాత్రం చూపించలేదు.
రష్మికలో ఈ స్వభావానికి చిన్నప్పుడే బీజం పడింది. అమ్మడు ఓ మధ్య తరగతి కుటుంబంలోనే జన్మించింది. కష్ట సుఖాలు తెలిసిన నటి. కుటుంబ విలువలేంటో తెలుసుకుంది. రష్మిక తల్లిదండ్రులు, చెల్లెల్ని ఎంతో బాగా చూసు కుంటుందో తెలిసిందే. బంధువులు, స్నేహితురాళ్ల విషయంలోనూ అమ్మడు అంతే పాజిటివ్ గా ఉంటుంది. ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే ఇప్పటి నుంచి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలైనట్లే. మరికొన్ని రోజుల్లో పెండింగ్ షూటింగ్ లు అన్నింటినీ పూర్తి చేయనుంది. దానికి సంబంధించి ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది.