శ్రీవిష్ణు ‘మృత్యుంజయ’ మ్యాజిక్.. సెకండ్ వీక్‌లోనూ అదే సౌండ్
కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో శ్రీవిష్ణు రూటే వేరు. అందుకే ‘కింగ్ ఆఫ్ కంటెంట్’ అని తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.;
కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో శ్రీవిష్ణు రూటే వేరు. అందుకే ‘కింగ్ ఆఫ్ కంటెంట్’ అని తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. లేటెస్ట్ గా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ బాక్సాఫీస్ వద్ద మరోసారి ఆ విషయాన్ని నిరూపించింది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుండే ప్రేక్షకులను గట్టిగానే ఎట్రాక్ట్ చేస్తోంది.
సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు రెండో వారంలోకి అడుగుపెడుతున్నా అదే జోరును కొనసాగిస్తోంది. మార్చి 6న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ లభించింది. ఒక గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉండటంతో ప్రేక్షకులు థియేటర్స్ క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఉత్కంఠ రేకెత్తించే కథనం, ఎవరూ ఊహించని మలుపులు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.
కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ రియలిజం మిక్స్ చేసి ఉండటంతో ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైంది. వసూళ్ల పరంగా కూడా ‘మృత్యుంజయ’ దూసుకుపోతోంది. సాధారణంగా ఒక సినిమాకు వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గుతాయి, కానీ ఈ చిత్రానికి మాత్రం రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. వర్కింగ్ డేస్‌లో కూడా ఈ మూవీ స్ట్రాంగ్ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ముఖ్యంగా సిటీలు అర్బన్ సెంటర్లలో ఈ చిత్రానికి ఆక్యుపెన్సీ రేటు చాలా ఎక్కువగా ఉంది. ప్రేక్షకులు కొత్త తరహా కథలను ఆదరిస్తారని ఈ సినిమా రిజల్ట్ మరోసారి స్పష్టం చేసింది. సినిమా సక్సెస్‌లో దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ రాసుకున్న స్క్రీన్ ప్లే కీలక పాత్ర పోషించింది. ఎక్కడా సోది లేకుండా పక్కాగా ఇన్వెస్టిగేషన్ సాగడం ఆడియన్స్‌కు బోర్ కొట్టించలేదు.
అలాగే శ్రీవిష్ణు తన నటనతో సినిమాను నిలబెట్టారు. సెలబ్రిటీల నుండి క్రిటిక్స్ వరకు అందరూ ఈ సినిమాను ప్రశంసించడంతో సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సినీ ప్రముఖులు సైతం శ్రీవిష్ణు స్క్రిప్ట్ సెలక్షన్‌ను మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ వారంలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం కూడా ‘మృత్యుంజయ’కు కలిసి వచ్చే అంశం. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వేరే పోటీ లేకపోవడంతో, సినిమా చూసిన వారి నుండి వస్తున్న మంచి అభిప్రాయాలే ఈ వారం కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.
రెండో వారంలో కూడా ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ ఇదే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మౌత్ టాక్ బలంగా ఉండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా శ్రీవిష్ణు తన ఖాతాలో మరో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్నారు. వినూత్నమైన కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టింది. థియేటర్లలో ‘మృత్యుంజయ’ ప్రభంజనం చూస్తుంటే ఇది లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది. గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ కూడా ఈ సినిమా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.