యూట్యూబ్ నుంచి పెద్ద బ్యానర్ వరకు… క్రేజీగా మౌళి నెక్ట్స్ ప్రాజెక్టు!

యూట్యూబ్ వేదికగా తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న మౌళి త‌నుజ్ తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు.;

Update: 2026-03-11 13:30 GMT

యూట్యూబ్ వేదికగా తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న మౌళి త‌నుజ్ తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మంచి క్రేజ్ సంపాదించిన మౌళి ఇప్పుడు కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈసారి మౌళి ఒక క్రైమ్ కామెడీ జానర్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండటం ప్రాజెక్ట్‌పై మరింత ఆస‌క్తిని పెంచుతోంది.

క్రైమ్ కామెడీ జాన‌ర్ లో..

ఈ సినిమాకు మురళి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. మౌళి స్టైల్‌లో ఉండే సహజ హాస్యానికి క్రైమ్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ దర్శకుడు కథను రెడీ చేసినట్లు సమాచారం. కామెడీతో పాటు థ్రిల్, సస్పెన్స్ అంశాలు కూడా ఈ సినిమాలో భాగంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మౌళి స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా కథను తీర్చిదిద్దారని టాక్ వినిపిస్తోంది.

మైత్రీ నిర్మాణంలో మౌళి..

ఇటీవల భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడం వల్ల ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్ లో ప్రత్యేకమైన దృష్టి పడింది. సాధారణంగా తక్కువ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ మంచి విజయాలు అందుకున్న మౌళి, ఇప్పుడు పెద్ద బ్యానర్‌తో క‌లిసి పని చేయడం అత‌ని కెరీర్‌లో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.

చిన్న సినిమాలు.. పెద్ద విజ‌యాలు

మౌళి గతంలో నటించిన సినిమాలు ఎక్కువగా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి లాభాలను అందించాయి. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా ఆశించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. సుమారు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ తో మౌళి పేరు యూత్ ఆడియ‌న్స్ లో మరింత బలపడింది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికల ద్వారా వచ్చిన ఫాలోయింగ్ థియేటర్లలో కూడా మౌళికి మంచి సపోర్ట్‌గా మారింది.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో బిజీగా..

అలాగే 90స్ వెబ్ సిరీస్ ద్వారా మౌళి ఇప్పటికే డిజిటల్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించారు. ఆ సిరీస్ స‌క్సెస్ తో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. తరువాత వచ్చిన లిటిల్ హార్ట్స్ స‌క్సెస్‌తో అత‌ని మార్కెట్ కూడా పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మౌళి చేస్తున్న తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ క్రైమ్ కామెడీ సినిమా మౌళి కెరీర్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ షెడ్యూల్ వంటి వివరాలను త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి సినిమాల వరకు తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న మౌళి, ఈ కొత్త క్రైమ్ కామెడీ ప్రాజెక్ట్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ సినిమాపై మరింత స్పష్టత రానుంది.

Tags:    

Similar News