2030 వరకూ మెగాస్టార్ ప్లానింగ్ ఇలా!
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేయడమే కాదు. 2030 వరకు టాలీవుడ్‌లో తన ప్రస్థానం ఎలా ఉండాలో ? స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.;
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేయడమే కాదు. 2030 వరకు టాలీవుడ్‌లో తన ప్రస్థానం ఎలా ఉండాలో ? స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. విభిన్న జోనర్లు, కొత్త తరం దర్శకులతో ప్రయోగాలు చేస్తూ పరిశ్రమ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా కనిపిస్తోంది అంటే? కెరీర్ లో మునుపెన్నడూ లేని విధంగా 2026 నుండి విజువల్ వండర్స్ , సోషియో-ఫాంటసీ చిత్రాలకు పెద్దపీట వేస్తున్నారు. 2030 లోపు కనీసం రెండు భారీ బడ్జెట్ విజువల్ చిత్రాలను పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లు మెగా కాంపౌండ్ వర్గాల నుంచి తెలిసింది.
దీనిలో భాగంగానే ఇప్పటికే సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ `విశ్వంభర` చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రయోగాలు ఆయనకు కొత్తేం కాదు. కెరీర్ మధ్యస్థ దశలోనే ఇలాంటి విజువల్ ట్రీట్ అందించారు. అయితే ఇప్పుడొచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో మరిన్ని విజువల్ వండర్స్ అందించాలనే తాపత్రయం కనిపిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా గ్రాఫిక్స్ ,విజువల్ ఎఫెక్ట్స్ తో నేటి తరం ప్రేక్షకులను అలరించడంపై ఆసక్తిగా ఉన్నారు. అలాగే మెగాస్టార్ తన మార్కెట్‌ను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా పాన్-ఇండియా స్థాయికి విస్తరించాలని బలమైన ఆలోచనతో ఉన్నారుట.
రాబోయే ఐదేళ్లలో ఆయన చేయబోయే చిత్రాలన్నీ ఇతర భాషల్లో కూడా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారుట. దీనిలో భాగంగా మెగాస్టార్ 158వ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో కలిసి పనిచేయడానికి రెడీ అయ్యారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి మల్టీ-స్టారర్ చిత్రాలు అన్ని భాషల నటులతో చేయాలని ఆశీస్తున్నారు. అలాగని రీజనల్ కంటెంట్ కి దూరం కారు. మెగా ప్రేక్షకాభిమానుల కోసం కమర్శియల్ చిత్రాలు చేస్తూనే ఆ రకమైన సినిమాలు చేయనున్నారు.
అలాగే యువ దర్శకులను సరికొత్త శైలిని ప్రోత్సహించడం టార్గెట్ గా పెట్టుకున్నారుట. దీనిలో భాగంగా అనీల్ రావిపూడితో `మనశంకర వరప్రసాద్ గారు` చేసారు. ఇటీవలే రిలీజ్ అయిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. `దసరా` ఫేం శ్రీకాంత్ ఓదెల వంటి యువ ప్రతిభావంతుడితోనే ఓ కమిట్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందనుంది. సినిమాలు చేసే విధానంలో తన సీనియార్టీని పూర్తిగా పక్కనబెట్టి నవ నాయికుడిలా ముందుకు నడవాలనుకుంటున్నారు? అన్నది సుస్పష్టం.
అటు నిర్మాతగా కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లో చిరంజీవి నిర్మాతగా సినిమాలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారుట. పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల ఆధ్వర్యంలో వెబ్ సిరీస్‌లు, చిన్న సినిమాలు నిర్మిస్తూ 2030 నాటికి బ్యానర్‌ను టాలీవుడ్‌లో ప్రధాన ప్రొడక్షన్ హౌస్‌గా మార్చాలన్నది ప్లాన్ గా తెలిసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోసం స్పెషల్ కంటెంట్ సిద్ధం చేసి డిజిటల్ విప్లవంలో కూడా భాగస్వామి కావాలన్నది చిరు ఆసక్తిగా తెలుస్తోంది.