ఈవెంట్లో య‌శ్ ప్ర‌శంస‌లు.. దేవీశ్రీ రిప్ల‌య్ ఊహించ‌ని రీతిలో!

దేవి శ్రీ ప్రసాద్ తన పోస్ట్‌లో యశ్ నిరాడంబరతను, నిజాయితీని కొనియాడారు. నా సంగీతం అంటే మీకు ఎంత ఇష్టమో వ్యక్తిగతంగా నాతో ఎప్పుడూ చెప్తుంటారు.

Update: 2026-08-26 04:25 GMT

పాన్ ఇండియాలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఒక ప్ర‌ముఖ హీరో.. లైవ్ వేడుక‌లో త‌న‌కు ఇష్ట‌మైన మ్యూజిక్ డైరెక్ట‌ర్ గురించి ప్ర‌స్థావించ‌డ‌మే కాకుండా.. అత‌డి మ్యూజిక్ ని తాను ఎంతో ఆస్వాధిస్తాన‌ని అన‌డం నిజంగా గొప్ప మైలురాయి. ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కి అంత‌కంటే ఏం కావాలి.. త‌నలోని ప్ర‌తిభ‌కు ప్ర‌జ‌లు ఏనాడో ప‌ట్టంగ‌ట్టినా, ఇలాంటి అరుదైన ఘ‌ట‌న‌లు అత‌డికి మ‌రింత మైలేజ్ నిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఇదంతా ఎవ‌రి మ‌ధ్య‌? అంటే... రాకింగ్ స్టార్ యశ్.. రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ న‌డుమ సంఘ‌ట‌న ఇది.

త‌న అద్భుత‌మైన సంగీతంతో ద‌శాబ్ధాల పాటు దేవీశ్రీ ప్ర‌సాద్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి అభిమానుల‌లో రాకింగ్ స్టార్ య‌ష్ కూడా ఒక‌రు. అంతేకాదు.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ - రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డిఎస్‌పి) మధ్య ఉన్న అనుబంధం తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల టాక్సిక్ ఈవెంట్ వేదికపై తన సంగీతాన్ని ఉద్దేశించి యశ్ మాట్లాడిన మాటలకు మైమరచిపోయిన దేవి శ్రీ ప్రసాద్ ఎక్స్ వేదికగా యశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక భావోద్వేగమైన పోస్ట్‌ను షేర్ చేసారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాలు స‌హా అభిమానుల్లోనూ వైర‌ల్‌గా మారుతోంది.

దేవి శ్రీ ప్రసాద్ తన పోస్ట్‌లో యశ్ నిరాడంబరతను, నిజాయితీని కొనియాడారు. నా సంగీతం అంటే మీకు ఎంత ఇష్టమో వ్యక్తిగతంగా నాతో ఎప్పుడూ చెప్తుంటారు. కానీ మీ సినిమా వేదికపై అందరి ముందూ నా సంగీతం గురించి అంత మనస్ఫూర్తిగా మాట్లాడటం మీ నిజాయితీకి, సంస్కారానికి నిదర్శనం. మీరు ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఎంతో డౌన్-టు-ఎర్త్.. స్వీట్ పర్సన్! అంటూ యశ్‌తో తనకున్న స్నేహాన్ని, సోదరభావాన్ని దేవిశ్రీ ప్రసాద్ గుర్తుచేసుకున్నారు.

ఇదే క్రమంలో యశ్ నటించిన‌ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాయాలని డిఎస్‌పి ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్ట్ తోడుగా నిలిచిన దర్శకురాలు గీతు మోహన్‌దాస్, కథానాయికలు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి మైత్ర, హుమా ఖురేషితో పాటు సంగీత దర్శకుడు రవి బస్రూర్, నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌లను ట్యాగ్ చేస్తూ `టాక్సిక్` చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సంగీత దర్శకుడు డిఎస్‌పి పోస్ట్‌కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించే ఆల్బమ్స్ ఏ స్థాయిలో ఊపు తెస్తాయో గుర్తుచేసుకుంటూ డిఎస్‌పి ఎరా మళ్లీ రిపీట్ కావాలి! అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. యశ్ సినిమాల్లో డిఎస్‌పి అందించిన ఎనర్జిటిక్ చార్ట్‌బస్టర్ సాంగ్స్‌ను రీట్వీట్లు చేస్తూ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

మొత్తానికి `టాక్సిక్` సినిమా విడుదల కాకముందే ఇండస్ట్రీలోని అగ్ర నటులు, సాంకేతిక నిపుణుల మధ్య ఉన్న ఈ ఆరోగ్యకరమైన వాతావరణం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాకింగ్ స్టార్ యశ్ మాస్ క్రేజ్.. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్‌పి ల మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం చూసి సినీ ప్రియులు `హ్యాట్సాఫ్` చెబుతున్నారు. ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లోను భ‌విష్య‌త్ లో సినిమాలు రావాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News