• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర' టీజర్.. అందరి ఫోకస్...

దేవర' టీజర్.. అందరి ఫోకస్ అతనిపైనే..

| కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ 'దేవర' కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-10 17:50 GMT

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ 'దేవర' కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెలలోనే దేవర టీజర్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 20 లేదా 22 తేదీల్లో దేవర టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ టీం టీజర్ కట్ పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే దేవర టీజర్ రిలీజ్ కాబోతుందనే విషయం తెలిసి అందరి దృష్టి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పైనే పడింది.

టీజర్ కోసం అనిరుద్ ఎలాంటి బీజీయం ఇస్తారో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లో రాబోయే దేవర టీజర్ కోసం అనిరుద్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అందరూ దీని కోసమే ఎదురు చూస్తున్నారు. అసలే టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అందులోనూ సౌత్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. నిజానికి దేవరకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారని విషయం బయటికి వచ్చినప్పటి నుంచే సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి.

ఈ ఏడాది జైలర్, జవాన్, లియో వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు అనిరుద్. ఈ మూడు సినిమాల్లో అనిరుద్ బీజీయం సినిమా సక్సెస్ కి కీలకంగా మారింది. ఈ సినిమాలతో అనిరుద్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. దానికి తోడు చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో అనిరుద్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత జెర్సీ సినిమాకి మ్యూజిక్ అందించిన అనిరుద్..

మళ్లీ ఇంత గ్యాప్ తర్వాత దేవర మూవీకి స్వరాలు సమకూరుస్తున్నాడు. నిజానికి ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాకే అనిరుద్ మ్యూజిక్ అందించాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అనిరుద్ ప్లేస్ లో తమన్ ని తీసుకున్నారు. అందుకే ఈసారి ఎన్టీఆర్ దేవర కోసం అనిరుద్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి దేవర మూవీకి అనిరుద్ కంపోజిషన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది టీజర్ తోనే తేలిపోనుంది.

కాగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలిలేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags:    
  • Devara 
  • ntr 
  • Koratalsiva 
  • Anirudh 
  • Kalyanram 
  • Sudhakarmikilineni 
  • Bgm 
  • teaser 

Similar News

నేటి కుర్ర హీరోల్లో ఆత్మవిశ్వాసం లేదు.. వాళ్లే చివరి సూపర్‌స్టార్లు!

2026-11-07 01:30 GMT

ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు కొత్త చిక్కు.. స్క్రిప్ట్ దశలోనే చట్టం తెలియ‌క‌పోతే!

2026-11-07 00:30 GMT

యుద్ధం మార్చిన బాల్యం: బాలిక జీవితం ఆధారంగా డాక్యుమెంటరీ

2026-11-06 23:30 GMT

2000-2026 మధ్య తెలుగులో టాప్ 5 విలన్ క్యారెక్టర్స్ ఇవే...

2026-11-06 22:30 GMT

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

Copyright @2026

Powered by Blink CMS