• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2000-2026 మధ్య తెలుగులో...

2000-2026 మధ్య తెలుగులో టాప్ 5 విలన్ క్యారెక్టర్స్ ఇవే...

| తెలుగు సినిమాల్లో హీరోలతో సమానంగా విలన్ పాత్రలు కూడా ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తాయి. అలాంటి ఐదు ఐకానిక్ విలన్ పాత్రల్లో బాహుబలిలో భల్లాలదేవ (రానా), ఒక్కడులో ఓబుల్ రెడ్డి (ప్రకాష్ రాజ్), అరుంధతిలో పశుపతి (సోనూసూద్), సైలో భిక్షు యాదవ్ (ప్రదీప్ రావత్), జయంలో రఘు (గోపీచంద్) నిలిచారు. తమ నటనతో ఈ పాత్రలు ప్రేక్షకులను భయపెట్టి గుర్తుండిపోయాయి.

By - Gopi Velupala
Update: 2026-11-06 22:30 GMT

సినిమా సక్సెస్ లో హీరో క్యారెక్టర్ తో పాటు విలన్ పాత్ర కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హీరో క్యారేజేషన్ తో ఎలాగైతే ప్రేక్షకుడిలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో, ప్రతి నాయకుడి పాత్రను కూడా అదే రేంజ్ లో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా డిజైన్ చేయాలి. దానివల్ల సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. అలాగే కొన్ని సంవత్సరాల పాటు ఆ పాత్రలను ఐకానిక్ క్యారెక్టర్లుగా గుర్తుంచుకుంటారు. 2000 నుచి 2006 మధ్య కాలం లో వచ్చిన సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలో ప్రేక్షకులను భయపెట్టించి హీరోకి ఏ మాత్రం తగ్గకుండా నటించిన 5 క్యారెక్టర్లు ఏంటో తెలుసుకుందాం...

1. భల్లాలదేవ (రానా) - బాహుబలి1&2

తన కంటే చిన్నవాడైన తన తమ్ముడు రాజు అవుతున్నాడనే ఈర్ష్య తో తనకి దక్కాల్సిన రాజ్యం బాహుబలి కి ఎలా దక్కుతుందని కోపంతో ఆయన మాటల్లో చేతల్లో చూపించే రాక్షసత్వం మామూలుగా ఉండదు. అలాగే బాహుబలి భార్య దేవసేన ను హింసించడం లో రాక్షసానందం వెతుక్కునే భల్లాల దేవ పాత్ర తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత పవర్ ఫుల్ పాత్ర అనే చెప్పాలి...

2. ఓబుల్ రెడ్డి (ప్రకాష్ రాజ్) - ఒక్కడు

కర్నూలు ప్రాంతంలో 'ఓబుల్ రెడ్డి' అనే దుర్మార్గుడు అక్కడ ఉండే జనాన్ని భయపెడుతూ తనకి ఎదురు తిరిగిన వాళ్ళను చంపుతుంటాడు. ఓబుల్ రెడ్డి తనలో ఉన్న విలనిజాన్ని చూపిస్తూనే హీరోయిన్ స్వప్న టాపిక్ వచ్చినప్పుడు మాత్రం చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తుంటాడు, స్వప్న కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. అలాగే చివర్లో స్వప్న నువ్వు అజయ్ ని ఓడిస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పే మాటను ఇగో గా తీసుకొని అజయ్ ని చంపి మగాడిలా నీ మెడలో తాళి కడతానని చెప్పి వెళ్తాడు. డైరెక్టర్ గుణశేఖర్ పవర్ఫుల్ విలనిజం ఉన్న పాత్ర ను డిజైన్ చేస్తే, దానికి ప్రకాష్ రాజ్ ప్రాణం పోశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం గుర్తుండిపోయే పాత్రల్లో ఇది ఒకటి...

3.పశుపతి (సోనూసూద్) - అరుంధతి

పశుపతి చేసే అరాచకాలను భరించలేక గద్వాల్ సంస్థానం నుంచి అతన్ని వెలివేస్తారు. దాన్ని అవమానం గా తీసుకున్న పశుపతి తాంత్రిక విషయాలు నేర్చుకొని తనని వెలేసిన గద్వాల్ సంస్థానం రాజ్య వంశస్థుల మీద పగ తీర్చుకోవాలని చూస్తాడు. మొత్తానికైతే అరుంధతి చేతిలో చనిపోయి ప్రేతాత్మ గా మారి వాళ్లను ఇబ్బంది పెడతాడు. సోనూసూద్ చేసిన ఈ పాత్ర సినిమా చూసే ప్రేక్షకుడిలో భయాన్ని పుట్టించింది. కోడి రామకృష్ణ గారు రాసుకున్న ఆ పాత్రకి సోనూ సూద్ 100% న్యాయం చేశాడు. ఆ క్యారెక్టర్ లో ఉండే కామం పశుపతి స్క్రీన్ మీదకి రాగానే అతని కండ్లల్లో కనిపిస్తుంటుంది.

4. భిక్షు యాదవ్ (ప్రదీప్ రావత్) - సై

రాజమౌళి క్రియేట్ చేసిన ఈ పాత్ర ను చూస్తే ఇప్పటికీ భయం వేస్తుంది. ప్రదీప్ రావత్ ను విలన్ గా పరిచయం చేసిన తీరు బాగా వర్కౌట్ అయింది. కాలేజ్ కోసం స్టూడెంట్స్ తో రగ్బీ ఆడటం, వాళ్ళను భయపెట్టి కాలేజ్ ను దక్కించుకోవాలని చూసే పాత్రలో ఆయన క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. ఆ సినిమా చూస్తున్నంత సేపు భిక్షు యాదవ్ ఏం చేస్తాడో అనే భయం ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

5. రఘు (గోపీచంద్) - జయం

తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం మూవీ లో రఘు (గోపీచంద్) తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన సుజాత (సదా) తో గొడవ పెట్టుకొని ఆమె ను అసహ్యించుకుంటాడు. కానీ పెద్దయ్యాక పెళ్లి చూపుల్లో సుజాత ను చూసి తనకే దక్కాలి అనుకుంటాడు. సుజాత ను ప్రాణంగా ప్రేమిస్తున్న వెంకట్ (నితిన్) ను చంపి తనను దక్కించుకోవాలని చూస్తాడు. అందులోనే ఆయన క్రూరమైన విలనిజాన్ని చూపించాడు... గోపీచంద్ యాక్టింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అయింది.

నిజానికి 2000 నుంచి 2026 మధ్య వచ్చిన మరికొన్ని సినిమాల్లో విలన్స్ యాక్టింగ్ బాగా ఎలివేట్ అయింది. అందులో విక్రమార్కుడు లో టేట్లా (అజయ్), మగధీర లో రణాదేవ్ బిల్లా (దేవ్ గిల్), ఈగ లో సుదీప్ (సుదీప్), లెజెండ్ లో జితేంద్ర (జగపతి బాబు), సరైనోడు లో వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) లాంటి నటులు విలన్స్ గా అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చారు. కానీ టాప్ 5 లో నిలిచిన క్యారెక్టర్స్ గురించి మాత్రమే మనం ఇక్కడ చర్చించుకున్నాం...

Tags:    
  • telugucinema 
  • tollywoodvillains 
  • top5villains 
  • bahubaali 
  • prakashraj 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS