• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యుద్ధం మార్చిన బాల్యం:...

యుద్ధం మార్చిన బాల్యం: బాలిక జీవితం ఆధారంగా డాక్యుమెంటరీ

| సిరియా అంతర్యుద్ధంలో సర్వం కోల్పోయి శరణార్థిగా మారిన ఇస్రా అనే బాలిక పదేళ్ల జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందిన 'వన్ ఇన్ ఎ మిలియన్' డాక్యుమెంటరీ చర్చనీయాంశంగా మారింది. జాక్ మెక్‌ఇన్నెస్, ఇటాబ్ అజ్జామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అలెప్పో నుంచి ఎనిమిది దేశాల సరిహద్దులు దాటి జర్మనీలో స్థిరపడిన ఇస్రా జీవితాన్ని చూపిస్తుంది. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆడియెన్స్ అవార్డు గెలుచుకుని ప్రశంసలు అందుకుంది.

By - Srikanth Kontham
Update: 2026-11-06 23:30 GMT

సిరియా అంతర్యుద్ధం కారణంగా సర్వస్వం కోల్పోయి శరణార్థిగా మారిన ఓ చిన్నారి పదేళ్ల ప్రయాణాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరించిన డాక్యుమెంటరీ చిత్రం `వన్ ఇన్ ఎ మిలియన్` ప్రస్తుతం హాలీవుడ్ వర్గాల్లో చర్చనీ యాంశమైంది. జాక్ మెక్‌ఇన్నెస్, ఇటాబ్ అజ్జామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ శరణార్థి జీవితంలోని అసలు కోణాన్ని ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపుతోంది. కేవలం రాజకీయ వార్తలు .. గణాంకాలకే పరిమితం కాకుండా ఒక మనిషి పడే మానసిక వేదనను సినిమా ద్వారా దర్శకులు అద్భుతంగా తెరకెక్కించారు.

ఈ చిత్ర కథాంశం 2015లో టర్కీ వీధుల్లో ప్రారంభమవుతుంది. అప్పట్లో 11 ఏళ్ల వయసున్న ఇస్రా అనే సిరియన్ బాలిక తండ్రితో కలిసి రోడ్డు పక్కన సిగరెట్లు అమ్ముతూ జీవనం సాగిస్తుండేది. ఆ సమయంలో ఆమెను కలిసిన దర్శకులు జాక్, ఇటాబ్ ఆమెలో ఉన్న ఉత్సాహాన్ని చూసి ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించు కున్నారు. అలెప్పో నగరం నుండి ప్రాణభయంతో పారిపోయి ఎనిమిది దేశాల సరిహద్దులు దాటుకుంటూ జర్మనీలో స్థిరపడే వరకు ఈ కుటుంబం పడ్డ కష్టాలన్నింటినీ చిత్రంలో కవర్‌ చేశారు.

ఈ ప్రయాణంలో చిత్ర బృందం కూడా ఆ కుటుంబంతో పాటే ప్రయాణించింది. సెర్బియా, క్రొయేషియా దేశాల్లోని గడ్డకట్టే చలిలో, రోడ్లపై, వానల్లో వారితో పాటు నివసిస్తూ ఒకే కుటుంబంగా మారిపోయారు. శరణార్థులంటే కేవలం రాజకీయ నాయకుల చర్చల్లోని అంశాలు కారనీ వారి వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయని ఈ చిత్రం నిరూపిస్తుంది. ఇస్రా బాల్యం నుండి కౌమారదశకు చేరడం, వివాహం, మాతృత్వం వరకు ప్రతి దశను ఈ పదేళ్ల ప్రయాణంలో అత్యంత సహజంగా కెమెరాలో బంధించారు.

జర్మనీలో కొత్త స్వేచ్ఛను అనుభవిస్తూనే సంప్రదాయాలకు కట్టుబడి ఉండే కుటుంబాల మధ్య జరిగే సంఘర్షణను ఇందులో స్పష్టంగా చూపించారు. కాలక్రమేణా పెద్దదైన ఇస్రా, వివాహం తర్వాత తన భర్తతో కలిసి తిరిగి సిరియాను సందర్శించడం ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశంగా నిలుస్తుంది. శరణార్థుల జీవితాలలోని క్లిష్టతను ప్రేక్షకులు తొంభై నిమిషాల్లో అనుభవించేలా ఈ సినిమా రూపొందిందని దర్శకులు పేర్కొన్నారు.

ఈ డాక్యుమెంటరీ చిత్రం ఈ ఏడాది జనవరిలో జరిగిన సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ఘన విజయం సాధించింది. అక్కడ ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ స్పందనతో ఆడియెన్స్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ వేడుకకు టర్కీ వీధుల్లో చిన్నప్పుడు సిగరెట్లు అమ్ముకున్న ఇస్రాను రహస్యంగా తీసుకురావడంతో అక్కడి ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. సరిహద్దుల కష్టాలను ఎదుర్కొంటూ అడుగులు వేసిన ఆ చిన్నారి నేడు ప్రపంచ వేదికపై తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం అందరినీ ఆలోచింపజేస్తోంది. శరణార్థుల సమస్యలపైనే కాకుండా మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రం ప్రస్తుతం సినిమా ప్రేమికుల చేత కన్నీరు పెట్టించడంతో పాటు విశేష ఆదరణ పొందుతోంది.

Tags:    
  • oneinamillion 
  • syrianrefugee 
  • documentaryfilm 
  • sundancefilmfestival 
  • isra 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS