• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేటి కుర్ర హీరోల్లో...

నేటి కుర్ర హీరోల్లో ఆత్మవిశ్వాసం లేదు.. వాళ్లే చివరి సూపర్‌స్టార్లు!

| బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ ప్రస్తుత తరం నటులపై తీవ్ర విమర్శలు చేశారు. యువ నటుల్లో ఆత్మవిశ్వాసం తగ్గిందని, నటనపై దృష్టి పెట్టకుండా పాటలు, మ్యూజిక్, క్యాస్టింగ్ వంటి విషయాల్లో దర్శకుల నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. షారుఖ్, సల్మాన్, అమితాబ్, అక్షయ్ వంటి సీనియర్ హీరోలు దర్శకులను నమ్మి పనిచేస్తారని ప్రశంసించారు. ప్రస్తుత తరం నటులు తమ పద్ధతులు మార్చుకోవాలని సూచించారు.

By - Srikanth Kontham
Update: 2026-11-07 01:30 GMT

బాలీవుడ్ నటి, దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యువ నటుల తీరుపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా తనదైన శైలిలో అనుభవం ఉన్న పరాఖాన్ ఇండస్ట్రీలో నిఖార్సయిన సూపర్‌స్టార్ల కల్చర్ దాదాపు కనుమరుగైందని తేల్చిచెప్పారు. ప్రస్తుత తరం నటుల్లో ఆత్మవిశ్వాసం లోపించిందని.. అత్యధికులు తీవ్ర అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారని స్పష్టం చేశారు.

నేటి యువ నటులు నటనపై దృష్టి పెట్టకుండా సినిమాలో ప్రతీ విభాగంలోనూ వేలు పెడుతున్నారని ఫరా ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. పాటల కొరియోగ్రఫీ, మ్యూజిక్ సెలెక్షన్, చివరికి క్యాస్టింగ్ విషయంలోనూ దర్శకుల నిర్ణయాలను తప్పుపట్టడం లేదా అనవసరంగా జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారిందని తెలిపారు. నటీనటులకు మ సొంత సామర్థ్యంపై నమ్మకం లేకపోవడం, దర్శకులపై గౌరవం తగ్గడమే ఇలాంటి ప్రవర్తనకు ప్రధాన కారణమని విశ్లేషించారు.

త‌న సినిమా ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఫరా ఖాన్ సీనియర్ హీరోల వృత్తి నైపుణ్యాన్ని కొనియాడారు. `మై హూ నా` చిత్రంలో సుస్మితా సేన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటానని చెప్పినప్పుడు గానీ `ఓం శాంతి ఓం` సినిమాలో దీపికా పదుకొణెను కొత్తమ్మాయిగా పరిచయం చేస్తున్నప్పుడు గానీ షారుఖ్ ఖాన్ ఒక్క క్షణం కూడా అనుమానించలేదని గుర్తుచేశారు. దర్శకుడి మేకింగ్‌పై నమ్మకంతో తన నిర్ణయానికి షారుఖ్ పూర్తిగా కట్టుబడ్డారని.. నిజమైన స్టార్లకు ఉండే లక్షణం అదేనని పేర్కొన్నారు.

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి దిగ్గజాలు దశాబ్దాల తరబడి పరిశ్రమలో కొనసాగుతున్నా? ఇప్పటికీ మొదటి సినిమాకు ప‌డినంత కష్టాన్ని ప్రతి చిత్రానికీ పడుతున్నారని ఫరా ప్రశంసించారు. సల్మాన్ ఖాన్ వంటి నటులు ఆదివారమైనా షూటింగ్‌కు రానని చెప్పని నిబద్ధతతో పనిచేస్తారని అన్నారు. కేవలం మ్యాగజైన్ కవర్ పిక్స్‌ కోసం, అవార్డు వేడుకల కోసం పాకులాడటం కాకుండా మంచి చిత్రాలను ఇవ్వడంపైనే శ్రద్ధ పెట్టాలని ప‌రాఖాన్ నేటి తరం హీరోలకు హితవు పలికారు.

కొత్త తరం నటీనటులు సెట్లోకి రాగానే ఇష్టానుసారంగా మార్పులు చేయాలని కోరడం, కనీసం డైలాగులు కూడా సరిగ్గా నేర్చుకోకుండా రావడం నిరుత్సాహానికి గురిచేస్తోందని ఫరా మండిపడ్డారు. నాలుగైదు సినిమాలు కాగానే తామే సర్వజ్ఞులమనే భ్రమలోకి వెళుతున్నారని విమర్శించారు. నేటి తరం నటులు తమ సరిహద్దులు దాటి ప్రవర్తించడం వల్ల సినిమా నాణ్యత తగ్గడమే కాకుండా స్టార్‌డమ్ కూడా క్రమంగా కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

పరిశ్రమలో ఉన్న షారుఖ్, సల్మాన్, అక్షయ్ వంటి దిగ్గజాలే బాలీవుడ్‌కు చివరి తరం సూపర్‌స్టార్లు అని వారు నటిస్తున్న ఈ సమయాన్ని ప్రేక్షకులు ఆస్వాదించాలని ఫరా ఖాన్ పిలుపునిచ్చారు. సెట్స్ పైకి వచ్చేముందు తమ పద్ధతులను మార్చుకోకపోతే యువ నటులు పరిశ్రమలో సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవడం కష్టమని చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

Tags:    
  • farahkhan 
  • bollywood 
  • shahrukhkhan 
  • youngactors 
  • superstars 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS