స్పిరిట్ మూవీ.. దీపిక అండ్ టీమ్ అసలు బాధ అదా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా స్పిరిట్ మూవీతో హాట్ టాపిక్ గా మారింది.;
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా స్పిరిట్ మూవీతో హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందుతున్న ఆ సినిమాలో దీపికను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు ఎప్పటి నుంచి టాక్ వచ్చింది.
కానీ ఆమెను తప్పించి యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ త్రిప్తి డిమ్రీని రంగంలోకి దించారు సందీప్ వంగా. ఆ సమయంలో మూవీ స్టోరీ లీక్ చేస్తున్నారని ఆయన సోషల్ మీడియాలో మండిపడ్డారు. డర్టీ పీఆర్ గేమ్స్ అని కామెంట్ చేశారు. ఇదేనా ఫెమినిజమ్ అని దీపికను ఇండైరెక్ట్ గా క్వశ్చన్ చేశారు. ఏం చేసుకున్నా పర్లేదు.. మొత్తం స్టోరీ లీక్ చేసుకోమని వార్నింగ్ ఇచ్చారు.
సందీప్ వంగా పోస్ట్ తర్వాత అసలేం జరిగిందోనని అంతా మాట్లాడుకున్నారు. అయితే దీపిక అనేక కండిషన్స్ పెట్టిందని టాక్ వినిపించింది. ఒక బిడ్డకు ఇటీవల తల్లి అయిన దీపిక రోజుకు తక్కువ గంటలు మాత్రమే పనిచేస్తాననడం, ఎక్కువ పారితోషికం కూడా అడగడంతో సందీప్ ను ఆమెను తప్పించారని వార్తలు వచ్చాయి.
అయితే దీపిక కండీషన్స్ పై డిస్కస్ చేయొచ్చని, అంతే గానీ స్టోరీ లీక్ చేయడం కరెక్ట్ కాదని అనేక మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టోరీ లీక్ చేయడం వెనుక అసలు కారణం.. త్రిప్తి డిమ్రీని ఫిమేల్ లీడ్ గా ఫిక్స్ చేయడమేనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
ప్రభాస్ తో యంగ్ బ్యూటీ స్క్రీన్ ను పంచుకుంటుందని ఆమె అంగీకరించలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారడంతో.. ఇది అస్సలు కరెక్ట్ కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. యంగ్ బ్యూటీస్ ను ఎంకరేజ్ చేయాలని.. అంతే గానీ ఇలా అస్సలు అంగీకరించకుండా ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. త్రిప్తి డిమ్రీతోపాటు మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలీవుడ్ బడా నిర్మాత భూషణ్ కుమార్ రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారు. మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.