మరణశిక్ష వేసినా పర్వాలేదు.. కఠిన నిర్ణయం తీసుకున్న దర్శన్!

ప్రేయసి కోసం అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-27 10:12 GMT

ప్రేయసి కోసం అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఆయన తీసుకున్న కఠిన నిర్ణయం ఇటు ప్రజలను, అభిమానులనే కాదు అటు సెలబ్రిటీలను, న్యాయనిర్ణేతలను కూడా ఆశ్చర్యపరిచింది. విచారణ త్వరగా పూర్తిచేయండి.. నాకు మరణశిక్ష విధించిన పర్వాలేదు అంటూ దర్శన్ చేసిన కామెంట్లకు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అభిమాని హత్య కేసులో జైలు పాలైన కన్నడ నటుడు దర్శన్ జైలులో తనకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదు అంటూ పలుమార్లు కోర్టుకు గతంలో తన వాదనలు వినిపించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 20 సార్లు బెయిల్ కోసం అర్జీ వేసుకున్నా.. పట్టించుకోలేదు. విసిగిపోయిన ఆయన తాజా విచారణలో భాగంగా తన తరఫు లాయర్ తో పలు విషయాలను న్యాయ నిర్ణేతల ముందు ఉంచినట్లు తెలుస్తోంది..

విషయంలోకి వెళ్తే.. దర్శన్ తరఫు న్యాయవాది నేడు విచారణలో భాగంగా కోర్టులో వాదిస్తూ.. "జైలులో దర్శన్ కి కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదు. బెయిల్ కోసం 20 సార్లు పిటిషన్ పెట్టుకున్నా.. పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జైల్లో ఉంచడం కంటే విచారణ త్వరగా పూర్తిచేసి ఉరిశిక్ష వేసినా సమ్మతమే అని దర్శన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జైలులో ఖైదీలకు అందించాల్సిన కనీస సదుపాయాలు కూడా దర్శన్ కి కల్పించడం లేదు. జైలులో తగిన వసతులు ఏర్పాటు చేయాలి అని దర్శన్ ఎన్ని మార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో కనీస సౌకర్యాలు కల్పించకుండా.. కోర్టులో బెయిల్ లభించక దర్శన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు" అంటూ సునీల్ కోర్టుకు తెలియజేశారు.

"విచారణను త్వరగా పూర్తిచేసి శిక్ష విధిస్తే అనుభవించడానికి దర్శన్ సిద్ధంగా ఉన్నాడు" అని కూడా ఆయన తెలిపారు. ముఖ్యంగా వెన్నునొప్పి సమస్య తిరగబెట్టిందని, తనకు సెనైడ్ ఇస్తే తిని ఆత్మహత్య చేసుకుంటానని గతంలో దర్శన్ చేసిన వ్యాఖ్యలను కూడా న్యాయవాది సునీల్ ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు.. న్యాయవాది సునీల్ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి.. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇన్ని సంవత్సరాలుగా భోగభాగ్యాలు అనుభవించిన దర్శన్ ఇలా ఒక్కసారిగా కనీస సౌకర్యాలు లేకుండా జైలులో ఇబ్బంది పడడంతోనే బ్రతికుండడం కంటే చనిపోవడం మేలు అనే కఠిన నిర్ణయానికి వచ్చారు అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి తదుపరి విచారణలో న్యాయస్థానం దర్శన్ కు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

ఇకపోతే గత ఏడాది సహనటి పవిత్ర గౌడతో రిలేషన్ లో ఉన్న దర్శన్.. ఈ బంధానికి పదేళ్లు అంటూ పవిత్ర గౌడ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడంతోనే చిత్రదుర్గాకు చెందిన దర్శన్ అభిమాని రేణుకా స్వామి.. దర్శన్ కు భార్యా పిల్లలు ఉన్నారు అని, ఆయనను వదిలేయాలని చెబుతూనే.. మరొకవైపు పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్య మెసేజ్లు పెట్టారు. దీంతో విసిగిపోయిన ఆమె దర్శన్ తో పాటు మరి కొంతమంది గ్యాంగ్ తో కలిసి రేణుక స్వామిని హతమార్చారు. ప్రస్తుతం ఇదే కేసు కోర్టులో నడుస్తోంది.

Tags:    

Similar News