లోకేష్ పై తెలుగు ఆడియన్స్ నమ్మకం.. ఈ రేంజ్ లోనా..?

అతను చేసిన ఖైదీ, విక్రం కోలీవుడ్ లో ఎలా అయితే సక్సెస్ అయ్యిందో తెలుగులో కూడా దాదాపు అదే రేంజ్ హిట్ సాధించాయి.;

Update: 2025-08-05 12:30 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు. ఆగష్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు సర్ ప్రైజ్ చేయనున్నారు. ఐతే ఈ స్టార్ కాస్ట్ అంతా కూడా తెలుగులో సినిమా క్రేజ్ కు కారణమైంది. దీనికి తోడుగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు.

ఖైదీ, విక్రమ్ తెలుగులో హిట్..

అతను చేసిన ఖైదీ, విక్రం కోలీవుడ్ లో ఎలా అయితే సక్సెస్ అయ్యిందో తెలుగులో కూడా దాదాపు అదే రేంజ్ హిట్ సాధించాయి. లోకేష్ డైరెక్షన్ టాలెంట్ ని తెలుగు ఆడియన్స్ గుర్తించారు. అందుకే లోకేష్ తన సినిమాలను ఇక్కడ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా చేస్తున్నాడనిపిస్తుంది. ఖైదీ, విక్రం తర్వాత లియో సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ లోకేష్ మీద ఉన్న క్రేజ్ తో ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ ఇచ్చారు తెలుగు ఆడియన్స్.

ఇక ఇప్పుడు కూలీ సినిమాకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటిదాకా కూలీ సినిమాపై అసలేమాత్రం బజ్ లేదు. ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అప్పటి నుంచి సినిమా గురించి స్పెషల్ డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా దేవా రజినీకి సైమన్ నాగార్జున మధ్య జరిగే ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందనిపిస్తుంది. కూలీ సినిమాలో రజిని స్టైల్, స్వాగ్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో నాగార్జున విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు.

వార్ 2 ఉన్నా కూడా రజినీకాంత్ కూలీ ఇంట్రెస్ట్..

ఓ పక్క ఆగష్టు 14న ఎన్టీఆర్ నటించిన వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. హిందీలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వార్ 2 లో ఉంది ఎన్టీఆర్ కాబట్టి తెలుగు రిలీజ్ ఏ రేంజ్ లో ఉంటుందో గెస్ చేయొచ్చు. కానీ వార్ 2 ఉన్నా కూడా రజినీకాంత్ కూలీ మీద ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అనుకున్నట్టుగానే వార్ 2, కూలీ మధ్య టఫ్ ఫైట్ జరిగేలా ఉంది.

ముఖ్యంగా లోకేష్ మీద తెలుగు ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని అతను నిలబెట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి. లోకేష్ మాత్రం కూలీ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కూలీ సినిమాలో శృతి హాసన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ లో సర్ ప్రైజ్ చేస్తుంది. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే కూలీని ఆడియన్స్ కు దగ్గర చేసింది.

Tags:    

Similar News