• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చియాన్ విక్రమ్.. తెలుగులో...

చియాన్ విక్రమ్.. తెలుగులో కూడా అదే డెడికేషన్

| నిజానికి విక్రమ్ స్ట్రైట్ తెలుగులోనే హీరోగా 9 సినిమాలు చేసాడని చాలా మందికి తెలియదు.

By - Tupaki Desk
Update: 2024-08-18 04:53 GMT

ఇండియన్ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా అందరికి చేరువ అయిన నటుడు చియాన్ విక్రమ్. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో నటనతో వెర్సంటైల్ యాక్టర్ గా విక్రమ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి పక్కన పెడితే కేవలం విక్రమ్ యాక్టింగ్ కోసం థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు ఇండియాలో ఉన్నారని చెప్పొచ్చు. తమిళంలో స్టార్ హీరోగా ఉన్న విక్రమ్ కి తెలుగునాట కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.

నిజానికి విక్రమ్ స్ట్రైట్ తెలుగులోనే హీరోగా 9 సినిమాలు చేసాడని చాలా మందికి తెలియదు. తెలుగులో ఆయన మొదటిగా 1993లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో నటించారు. తరువాత నాగేశ్వరావు లీడ్ రోల్ లో చేసిన బంగారు కుటుంబం మూవీలో కూడా నటించారు. ఆయన నుంచి చివరిగా వచ్చిన స్ట్రైట్ తెలుగు మూవీ 9 నెలలు 2000లో వచ్చింది. తమిళంలో జెమినీ సినిమా అతనికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది.

తరువాత 2003లో చేసిన పితామగన్ మూవీ అయితే విక్రమ్ నటనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా తెలుగులో శివపుత్రుడు పేరుతో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. తరువాత అపరిచితుడు మూవీ విక్రమ్ ని యూనివర్సల్ యాక్టర్ గా మార్చేసింది. తెలుగులో 9 సినిమాలు చేసిన రాని గుర్తింపు అపరిచితుడు మూవీతో విక్రమ్ కి టాలీవుడ్ లో వచ్చింది. అయితే తమిళనాట స్టార్ గా ఉండటంతో విక్రమ్ అక్కడ సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అపరిచితుడు తర్వాత విక్రమ్ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. కానీ అతనిలో విలక్షణ నటుడిని మాత్రం ప్రతి సినిమా పరిచయం చేస్తూనే ఉంది. తాజాగా పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ సినిమాతో విక్రమ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకి రిలీజ్ అయిన అన్ని భాషలలో పాజిటివ్ టాక్ వస్తోంది. మరోసారి విక్రమ్ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడనే మాట వినిపిస్తోంది.

మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకున్న తర్వాత విక్రమ్ తంగలాన్ ప్రమోషన్స్ చేస్తూ ఉండటం విశేషం. తెలుగు, తమిళ్ రాష్ట్రాలలో చక్కర్లు కొడుతూ అన్ని ఈవెంట్స్ లలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇది చూసిన తర్వాత విక్రమ్ డెడికేషన్ ఎంతైనా నెక్స్ట్ లెవల్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో విక్రమ్ తంగలాన్ సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. అంత పెద్ద స్టార్ అయిన కూడా ప్రమోషన్స్ ని ఈ స్థాయిలో చేయడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. సినిమాకి ఎంత కష్టపడతాడో ప్రమోషన్స్ కోసం కూడా విక్రమ్ అంతే కష్టపడుతున్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా బుకింగ్స్ కూడా పెరిగాయనే మాట వినిపిస్తోంది.

Tags:    
  • Chiyaanvikram 
  • Thangalaan 
  • Telugumovies 
  • Dasarinarayana 
  • Chellalikapuram 
  • Gemini 
  • Pitamaganmovie 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS