చిరు బ్లాక్ బస్టర్ కాంబో.. గెట్ రెడీ!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి కొత్త కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఇప్పటికే వరుస సినిమాలు ఉన్నాయి.;

Update: 2025-08-21 16:10 GMT

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి కొత్త కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఇప్పటికే వరుస సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ షూటింగ్ జరుగుతోంది. అలాగే విశ్వంభర అనే భారీ సినిమా కూడా లైన్‌లో ఉంది. ఇక దీనితో పాటు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయాల్సి ఉంది. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, మరోసారి బాబీ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ కాంబినేషన్ గురించి టాక్ చాలా కాలంగా నడుస్తున్నప్పటికీ, ఇప్పుడు అధికారికంగా అప్డేట్ వచ్చింది. ‘చిరు బాబీ అగైన్’ అంటూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. శుక్రవారం, ఆగస్టు 22న మెగాస్టార్ 70వ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 5:13 గంటలకు #ChiruBobby2 కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ పోస్టర్‌తోపాటు సినిమా టోన్, కాన్సెప్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదివరకే బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. మాస్ ఎంటర్టైనర్‌గా ఆ సినిమా రికార్డులు సృష్టించడం, చిరంజీవి స్టైల్, బాబీ టేకింగ్ కాంబినేషన్ సక్సెస్ కావడంతో, ఇప్పుడు వీరి కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. బాబీకి మాస్ సినిమాలపై పట్టు ఉండడం, చిరంజీవి ప్రతి ఫ్రేమ్‌ను హైలైట్ చేసే విధంగా చూపించడం వల్ల, ఈసారి కూడా ఓ మాస్ ఫెస్టివల్ మూడ్ మళ్లీ కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను కన్నడలో పెద్ద స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న KVN ప్రొడక్షన్స్ నిర్మించబోతుంది. ఇప్పటికే యశ్ ‘టాక్సిక్’, విజయ్ ‘జననాయకన్’ వంటి భారీ సినిమాలు చేయడం ద్వారా తమ శక్తిని నిరూపించుకున్న ఈ సంస్థ, ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. KVN ఎంట్రీతో సినిమా మరింత భారీ బడ్జెట్, పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కే అవకాశం ఉంది. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌కు కావలసిన విస్తృత స్థాయి ప్రొడక్షన్ విలువలు ఇస్తారని అంచనా.

చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భం ప్రత్యేకంగా అనిల్ రావిపూడి సినిమా అప్డేట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు కాన్సెప్ట్ పోస్టర్‌తో పాటు, ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను కూడా రెడీ చేస్తున్నారని టాక్. అంతేకాకుండా, ఓ సీనియర్ స్టార్ వాయిస్ ఓవర్‌తో చిరంజీవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇవ్వనున్నట్లు బజ్ వినిపిస్తోంది. ఈ సర్ప్రైజ్ కూడా అభిమానుల్లో ఆసక్తి పెంచేస్తోంది. అనిల్ రావిపూడి మూవీ, విశ్వంభర, శ్రీకాంత్ ఓదెలా ప్రాజెక్ట్, ఇప్పుడు బాబీ సినిమా.. ఇలా వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టి మెగాస్టార్ మళ్లీ తన రేంజ్ ఏంటో చూపించబోతున్నారు. ప్రతి సినిమా వేర్వేరు జానర్స్‌లో ఉండటంతో, ఫ్యాన్స్‌కు వరుస సర్ప్రైజ్‌లు రెడీ అవుతున్నాయి.

Tags:    

Similar News