రాజాసాబ్.. విశ్వంభరపై ఇప్పుడు అందరి మాట ఇదే!

టాలీవుడ్‌ లో భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.;

Update: 2025-12-30 08:06 GMT

టాలీవుడ్‌ లో భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడటానికి అభిమానులు సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే తాజాగా విశ్వంభర సినిమాపై వినిపిస్తున్న అభిప్రాయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఆ ఫాంటసీ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పరంగా అభిమానులను నిరాశపరిచింది. అద్భుతమైన విజువల్స్ ఆశించిన ప్రేక్షకులు, అవుట్‌ పుట్ చూసి కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వలేదు.

అదే కారణంతోనే విశ్వంభర సినిమాను సంక్రాంతి బరిలోకి తీసుకురావడం వాయిదా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదట సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ఆ చిత్రం, అనూహ్యంగా రేసు నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో చిరంజీవి నటిస్తున్న మరో మూవీ మన శంకర వర ప్రసాద్ గారు సినిమా తెరపైకి వచ్చింది.

ఇదిలా ఉండగా, ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ 2.0 సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌ లో కనిపించిన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, టెక్నికల్ క్వాలిటీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హారర్ ఫాంటసీ టచ్‌ తో రూపొందిన సినిమా, వీఎఫ్ ఎక్స్ విషయంలో టాలీవుడ్‌ లో కొత్త బెంచ్‌ మార్క్ సెట్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలోనే సినీ వర్గాల్లో మరో అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదేంటంటే విశ్వంభర సినిమాకు కూడా రాజా సాబ్ తరహా మేకోవర్ అవసరం ఉందని అంతా చెబుతున్నారు. సినిమాలో కథ, స్టార్ పవర్ మాత్రమే కాదు.. విజువల్స్ పరంగా కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే స్థాయిలో అవుట్ పుట్ ను మేకర్స్ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు.

అయితే చిరంజీవి సినిమా అంటే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు రావాలన్నది ఆయన అభిమానుల ఆశ. అందుకే వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్‌ పై మరింత శ్రద్ధ పెట్టి, వరల్డ్ వైడ్ వాల్యూస్ తో సినిమాను విడుదల చేయాలని ఇప్పుడు అంతా మేకర్స్ ను కోరుతున్నారు.

అవసరమైతే సినిమా విడుదల కాస్త లేట్ అయినా పర్లేదని.. కానీ క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడకూడదని అంటున్నారు. దీంతో అద్భుతమైన విజువల్ ట్రీట్‌ గా విశ్వంభర మూవీని ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పాలి. మరి విశ్వంభర మేకర్స్ ఏం చేస్తారో మరికొద్ది రోజుల వరకు వేచి చూడాలి.

Tags:    

Similar News