విశ్వంభ‌ర డ్యాన్స్ స్టార్మ్ షురూ!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ విశ్వంభ‌ర‌. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.;

Update: 2025-07-25 11:29 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ విశ్వంభ‌ర‌. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సోషియో ఫాంట‌సీ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో విశ్వంభ‌ర‌పై ఓ బుక్ ను రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టిన చిత్ర యూనిట్, ఇప్పుడు సినిమా నుంచి ఓ కీల‌క అప్డేట్ ను ఇచ్చారు. విశ్వంభ‌ర సినిమాకు సంబంధించిన ఆఖ‌రి షెడ్యూల్ తాజాగా మొద‌లైన‌ట్టు, చిరంజీవి సెట్స్ లో జాయినైట్టు డైరెక్ట‌ర్ వ‌శిష్ట అనౌన్స్ చేస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు. వ‌శిష్ట పోస్ట్ ను బ‌ట్టి చూస్తుంటే ఈ ఆఖ‌రి షెడ్యూల్ లో స్పెష‌ల్ సాంగ్ ను షూట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

విశ్వంభ‌ర ఆఖ‌రి షెడ్యూల్ లో చిరంజీవి, బాలీవుడ్ భామ మౌనీ రాయ్ పై ఓ స్పెష‌ల్ సాంగ్ ను తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. విశ్వంభ‌ర సినిమాతోనే మౌనీ రాయ్ టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మౌనీ రాయ్ తెలుగులో సినిమాలు చేసింది లేదు. విశ్వంభ‌ర సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా, ఈ స్పెషల్ సాంగ్ కు మాత్రం మాస్ సాంగ్స్ కు ఫేమ‌స్ అయిన‌ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

విశ్వంభ‌ర లోని ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎఎస్ ప్ర‌కాష్ హైద‌రాబాద్ లో ఓ భారీ సెట్ వేయ‌గా, గ‌ణేష్ ఆచార్య ఈ సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ చేయ‌నున్నారు. ఈ స్పెష‌ల్ సాంగ్ లో మౌనీ రాయ్ అందాలు, ఆమె స్టెప్పులు చూడ్డానికి అంద‌రూ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ త్వ‌ర‌లోనే రివీల్ చేయ‌నున్నారు.

Tags:    

Similar News