మెగాస్టార్ మూవీలో సూపర్ స్టార్.. ఏంటీ మ్యాటర్!

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని.. మెగాస్టార్ కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది.;

Update: 2026-02-02 05:37 GMT

మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మాస్ డైరెక్టర్ బాబీ కొల్లితో ఆయన మళ్లీ చేతులు కలపడంతో చిరు కొత్త ప్రాజెక్ట్‌ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని.. మెగాస్టార్ కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది.

ఇప్పుడు అదే సక్సెస్ కాంబో రిపీట్ అవుతుండటంతో మెగా 158 ప్రాజెక్టు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగాల్ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే పవర్‌ ఫుల్ గ్యాంగ్‌ స్టర్ యాక్షన్ డ్రామాగా సినిమా తెరకెక్కుతోందని సమాచారం. మాస్, ఎమోషన్, యాక్షన్ అంశాలతో కథను బాబీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ కోరుకునే మాస్ అవతార్‌ లో చిరును చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట.

అయితే ఆ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ యాక్ట్ చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య.. ఆయనను మేకర్స్ సంప్రదించారని, కానీ రెమ్యూనరేషన్ విషయంలో డీల్ కుదరలేదని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మోహన్ లాల్.. బాబీ- చిరు మూవీలోకి తీసుకున్నారని తెలుస్తోంది. పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమచారం.

సినిమాలో మోహన్ లాల్ ది కేవలం గెస్ట్ రోల్ కాకుండా.. కథను కీలక మలుపు తిప్పే పాత్రగా ఉండబోతుందని వినికిడి. అయితే చిరంజీవి, మోహన్ లాల్ వంటి ఇద్దరు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్ లో స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులకు అది నిజంగా ఫుల్ మీల్స్ లాంటి అనుభూతినే ఇస్తుంది. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హై- వోల్టేజ్ యాక్షన్‌ తో పాటు భావోద్వేగాలతో ఉంటాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో హీరోయిన్ గా సీనియర్ బ్యూటీ ప్రియమణిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి సరసన ఆమె నటించకపోవడంతో ఆ కాంబినేషన్ కొత్తగా అనిపించనుంది. కథలో ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉండబోతుందని, కీలక మలుపులకు కారణమయ్యేలా రోల్ ను డిజైన్ చేశారని సమాచారం. మూవీకి కాకా అనే మాస్ టైటిల్ ను పెట్టాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

అయితే బాబీ సినిమాలకు క్యాచీ టైటిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌ తో కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారట. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ తో పాటు మాస్ ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందని అంచనా. మరి మెగాస్టార్, మోహన్ లాల్ కాంబినేషన్.. ఏ రేంజ్ లో సందడి చేయనుందో వేచి చూడాలి.

Tags:    

Similar News