అనిల్ మరో మల్టీస్టారర్ చేయాల్సిందేనా?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2026-01-16 06:28 GMT

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజైంది. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటించగా, విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రలో కనిపించిన ఆ సినిమా.. ఇప్పుడు మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.

రిలీజ్ కు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ.. వాటిని అందుకుని ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫుల్ గా రప్పిస్తోంది. దీంతో మూవీ టీమ్ అంతా హ్యాపీ మోడ్ లో ఉంది. ముఖ్యంగా కెరీర్ లో ఇప్పటి వరకు వరుసగా తొమ్మిది హిట్లు అందుకున్న అనిల్ రావిపూడి.. ఇంకా ఆనందంగా ఉన్నారు.

అదే సమయంలో ఆయన అప్ కమింగ్ మూవీ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ల్యాండ్ మార్క్ పదో మూవీ ఎవరితో తీస్తారోరని అంతా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. అయితే ఇప్పటికే పలు మల్టీస్టారర్స్ తో సందడి చేసిన అనిల్ రావిపూడి .. ఇప్పుడు మరో మల్టీస్టారర్ చేయనున్నారట. అది అఫీషియల్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా రివీల్ అయింది.

రీసెంట్ గా చిరు, వెంకీ, అనిల్ రావిపూడి కలిసి మెగాస్టార్ ఇంట్లో స్పెషల్ పార్టీ చేసుకుని సరదాగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మన శంకర వరప్రసాద్ లాస్ట్ సీన్ షూట్ లో జరిగిన సంఘటనను చిరు గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఎప్పుడు కలుద్దామంటే, ఎప్పుడైనా రెడీ అని వెంకీ అన్నట్లు తెలిపారు చిరు. అప్పుడు మళ్లీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలనుందని రావిపూడి అన్నట్లు చెప్పారు.

ఇప్పుడు బెస్ట్ స్క్రిప్ట్ తో వస్తే.. వెంకీ లీడ్ రోల్ లో.. తాను క్యామియో రోల్ లో సినిమా చేస్తానని ఆఫర్ ఇచ్చారు చిరంజీవి. ఫుల్ స్క్రిప్ట్ లో ఇద్దరినీ బ్యాలెన్స్ చేసినా రెడీగా ఉన్నామని చెప్పారు. అక్కడే ఉన్న వెంకటేష్ కూడా ఓకే అన్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ మూవీని అనిల్ రావిపూడి.. వెంకీ, చిరుతోనే చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో గత ఏడాది వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సీక్వెల్ నే చిరంజీవి, వెంకటేష్ తో అనిల్ రావిపూడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. వెంకీ లీడ్ రోల్ లో.. చిరు క్యామియో రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఫిక్స్ అయ్యి ఉంటుందని, అందుకే ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారని అంతా అంటున్నారు. మరి అది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News