మెగాస్టార్ జిమ్ లో రెండు గంటలా?
మెగాస్టార్ చిరంజీవి స్లిమ్ లుక్ లో యువకుడిని తలపిస్తున్నారు. 70 ఏళ్ల చిరంజీవి 40 ఏళ్ల వయస్కుడిగా మారి పోయారు.;
మెగాస్టార్ చిరంజీవి స్లిమ్ లుక్ లో యువకుడిని తలపిస్తున్నారు. 70 ఏళ్ల చిరంజీవి 40 ఏళ్ల వయస్కుడిగా మారి పోయారు. న్యూ మేకోవర్ లో అలరిస్తున్నారు. మరి చిరంజీవిలో సడెన్ గా ఇంతటి మార్పుకు కారణం ఏంటి? అంటే అంతా సెట్స్ లో ఉన్న సినిమాల కోసమే ఆయన ఇలా రెడీ అయ్యారని అనుకుంటున్నారు. ప్రత్యేకించి `మనశంకర ప్రసాద్ గారు` కోసమే అనీల్ ఇలా వింటేజ్ చిరంజీవిని హైలైట్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కానీ అసలు సంగతి వేరే ఉందని తాజాగా లీకైంది. చిరంజీవిలో ఈ మార్పులకు అసలైన కారణం కింగ్ నాగార్జున అట.
చిరంజీవి రెండేళ్లగా స్లిమ్ అవ్వాలనుకుంటున్నారుట. కానీ ఇంత కాలం అది ఆచరణలో పెట్టడం సాధ్యం కాలేదు. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ యాక్షన్ స్క్రిప్ట్ తో అప్రోచ్ అయ్యారు. ఆ కథకు చిరు అప్పటి లుక్ ఎంత మాత్రం సెట్ అవ్వడం లేదుట. దీంతో టెస్ట్ షూట్ కూడా నిర్వహించి చూసారుట. అయినా సెట్ కాక పోవడంతో? బాగా స్లిమ్ అవ్వాలని..బరువు తగ్గితే తప్ప తాను అనుకున్న లుక్ రాదు అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసారుట. దీంతో చిరంజీవి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని లుక్ పరంగా మార్పులకు శ్రీకారం చుట్టారుట.
ఈ విషయంలో నాగార్జున ఎంతో సహకరించినట్లు తెలిసింది. డైట్ ప్లాన్ అంతా ఎలా ఉండాలి? అన్నది తానే సూచించారుట. ప్రత్యేకగా చిరు డైటీషీయన్, న్యూట్రిషన్లను అపాయింట్ చేసుకోలేదుట. నాగ్ సలహాలతో పాటు కోడలు ఉపాసన సూచనలతో డైట్ ను అమలు పరిచినట్లు ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది. అలా మొదలైన చిరంజీవి జిమ్ జర్నీ నేటికి దిగ్విజయంగా కొనసా గిస్తున్నారు. క్రమం తప్పకుండా రోజూ రెండు గంటల పాటు వ్యాయామాలు తప్పక చేస్తున్నారుట.
అధిక బరువులు కాకుండా సింపుల్ వెయిట్స్ నే ప్రిపర్ చేస్తున్నారుట. దీంతో పాటు వారంలో కొన్ని రోజులు వాకింగ్, రన్నింగ్ లాంటివి కూడా చేస్తున్నారుట. పుడ్ లో వీలైనంత వరకూ ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటున్నారుట. కార్పోహైడ్రేట్లు అధికంగా ఉండే పదార్దాలను పూర్తిగా అవాయిడ్ చేసినట్లు తెలుస్తోంది. అదీ చిరు బ్యూటీ సీక్రెట్. ఈ సంక్రాంతి కి `మన శంకరవరప్రసాద్ గారు` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రిలీజ్ కి సంబంధించి తేదీ ఫిక్స్ చేయాల్సి ఉంది.