చరణ్ 64 మిలియన్స్, చిరు 50 మిలియన్స్..!
ఐతే యాదృశ్చికంగా చిరంజీవి, చరణ్ అదే ఫాదర్ అండ్ సన్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.;
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ సూపర్ హిట్ చార్ట్ బస్టర్ లిస్ట్ లో నిలిచింది. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ తో ఇండియన్ మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తూ టాప్ 1 ట్రెండింగ్ లో నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సైరా తర్వాత చిరంజీవి, నయనతార కలిసి చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.
చరణ్ పెద్ది చికిరి సాంగ్...
ఐతే చిరు పాట ఇలా ట్రెండింగ్ లో ఉంది అనుకునేలోగా గ్లోబల్ స్టార్ చరణ్ పెద్ది చికిరి సాంగ్ రిలీజై అది సూపర్ హిట్ అయ్యింది. బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా పెద్ది. ఏ.ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలోని చికిరి వీడియో సాంగ్ రిలీజ్ కాగా అది ఏకంగా 24 గంటల్లోనే 64 మిలియన్ వూస్ తో రికార్డ్ సృష్టించింది.
అంతేకాదు పెద్ది సాంగ్ హిందీలో సూపర్ ట్రెండ్ అవుతుంది. ఏ.ఆర్ రెహమాన్ కి హిందీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. ఆయన ఏ ఆల్బం చేసినా సరే దాని మీద స్పెషల్ క్రేజ్ ఉంటుంది. పెద్ది లోని చికిరి సాంగ్ కూడా సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. ఐతే యాదృశ్చికంగా చిరంజీవి, చరణ్ అదే ఫాదర్ అండ్ సన్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
ఎక్కడ చూసినా అయితే మీసాల పిల్ల లేదా చికిరి సాంగ్..
ప్రస్తుతం ఎక్కడ చూసినా అయితే మీసాల పిల్ల లేదా చికిరి సాంగ్ వినిపిస్తుంది. మ్యూజిక్ లవర్స్ అంతా కూడా ఈ రెండు సాంగ్స్ ని సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాలకు ఈ సాంగ్స్ ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేయగా.. పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు.
మన శంకర వరప్రసాద్ అనిల్ మార్క్ ఎంటర్టైనర్ గానే వస్తున్నా సరే ఒక మంచి స్టోరీ కూడా కుదిరిందని తెలుస్తుంది. ఇక చరణ్ పెద్ది మాత్రం అతను ఒక ఆట కూలీగా ఉంటాడు. ఐతే అదే ఆటలో అతను ఎలా దమ్ము చూపించాడు అన్నది సినిమా కథ. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. పెద్ది సినిమాతో పాటు మార్చి 28న నాని ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక రోజు గ్యాప్ తో పెద్ది, ది ప్యారడైజ్ పోటీ పడనున్నాయి. సంక్రాంతికి మాత్రం చిరుతో పాటు ప్రభాస్ రాజా సాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి వస్తున్నాయి.