అన్నా-తమ్ముడు ఒకే ఏడాది బరిలోకి!
మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అయి చాలా కాలమవుతుంది.;
మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అయి చాలా కాలమవుతుంది. ఇద్దరు ముమ్మరంగా సినిమాలు చేస్తోన్న సమయంలో రిలీజ్ విషయంలో ఎదురెదురు పడేవారు. కొన్ని సందర్భాల్లో ఒకే సీజన్ లో పోటీ పడి ఉండొచ్చు కూడా. కానీ కాలక్రమంలో చిరంజీవి సినిమాలు తగ్గిం చడం...పవన్ కళ్యాణ్ కూడా బాగా వెనుకబడటంతో? అన్నదమ్ములిద్దరు ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం అన్నది జరగలేదు.
అయితే 2025 లో అందుకు పక్కాగా అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడుతుంది. సమ్మర్ కూడా రిలీజ్ కు లేదు. దీంతో జూన్ తర్వాతే రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న `హరిహరవీరమల్లు` కూడా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి.
ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడింది. ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ సవ్యంగా డేట్లు ఇవ్వకపోవడంతోనే జాప్యం జరుగుతంది. మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇది సాధ్యం కాదు. నిన్నటి నుంచే పవన్ వీరమల్లు షూటింగ్ కి హాజరవుతున్నారు. అది నేటితో పూర్తవుతుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ కొత్త తేదీని పరిశీలిస్తున్నారు. ఈసినిమా కూడా జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నా రు.
ఇది పక్కన బెడితే పవన్ ...చిరంజీవి నటించిన సినిమాలు చాలా కాలం తర్వాత ఒకే ఏడాదిలో రిలీజ్ అవ్వడం అన్నది 2025కే సాధ్యమైంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ ఏడాది ముగింపు కల్లా పక్కాగా రిలీజ్ అయిపోతాయి.