ఎల‌క్ష‌న్ డే హీట్.. ఓట్లు వేసిన‌ టాప్ స్టార్లు..

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ త‌మ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకున్నారు.

Update: 2024-05-13 05:13 GMT

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ త‌మ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకున్నారు. హైద‌రాబాద్ లో వారి వారి పోలింగ్ బూత్ ల‌లో ఓటు వేసి వ‌చ్చారు. ప్ర‌జ‌లంతా త‌మ ఓటును స‌ద్వినియోగం చేసుకుని, త‌మ‌ భ‌విష్య‌త్ ని నిర్ధేశించుకోవాల‌ని, స‌రైన నాయ‌కుడిని ఎన్నుకోవాల‌ని స‌ద‌రు స్టార్లు పిలుపునిచ్చారు.

 

మెగాస్టార్ చిరంజీవి త‌న‌ భార్య సురేఖ కొణిదల ఓటింగులో పాల్గొన్నారు. అనంత‌రం చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ, తన అభిమానులను ఓటు వేయాలని కోరారు. యువకులను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. అంద‌రూ ఇండ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు. కొత్త నీరు వ‌స్తోంది. మీ ఓటు శక్తిని ఉపయోగించుకోవాలని యువ ఓటర్లను అభ్యర్థిస్తున్నాను. ఓటు వేయడం మన హక్కు అని చిరు అన్నారు.

 

 

అల్లు అర్జున్ -జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓటు వేసి సిరా నింపిన‌ వేలిని చూపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది మనం రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశమని భావిస్తున్న‌ట్టు వారు తెలిపారు. ఈ దేశ పౌరులకు ఇది చాలా బాధ్యతాయుతమైన రోజు. మన జీవితంలో వచ్చే ఐదేళ్లకు ఈ రోజు అత్యంత కీలకమైన రోజు కాబట్టి ఆ చిన్న ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ ఓటు వేయండి.. బాధ్యతాయుతంగా ఓటు వేయండి అని అల్లు అర్జున్ కోరారు. తార‌క్ త‌న త‌ల్లి గారితో క‌లిసి ఓటు వేసారు.

Read more!

జ‌గ‌న్- బాబు- ప‌వ‌న్ ఓటు వేసారు:

 

 

ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకున్నారు. జ‌గ‌న్ పులివెందుల‌లో ఓటు వేయ‌గా, చంద్ర‌బాబు ఉండ‌వ‌ల్లి (గుంటూరు జిల్లా)లో ఓటు వేసారు. అలాగే తేదేపా నాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా హిందూపురంలో ఓటు వేసారు. ప్ర‌జాస్వామ్య ర‌క్ష‌ణ‌కు ఓటు ప‌విత్ర‌మైన ఆయుధ‌మ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాల‌ని బాల‌కృష్ణ కోరారు.

 

మ‌రోవైపు భార్య‌ అన్నా లెజినోవాతో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక విమానంలో విజ‌య‌వాడ‌కు చేరుకుని మంగ‌ళ‌గిరిలో త‌మ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఈరోజు మే 13న ఒకేసారి జరుగుతుండగా నాయ‌కులు ఓటు వేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ తూ.గో జిల్లా పిఠాపురం నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News