• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ హీరోయిన్.. మృణాల్...

ప్రభాస్ హీరోయిన్.. మృణాల్ రేంజ్ లో క్లిక్కయ్యేనా?

| అయితే ఇప్పుడు ప్రభాస్, హను రాఘవపూడి మూవీ హీరోయిన్ ఇమాన్వి కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-11-11 21:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్, కల్కి 2898 ఏడీ వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా మూవీ చేస్తున్నారు. అందులో సోషల్‌ మీడియా స్టార్‌ ఇమాన్వీ ఎస్మాయిల్‌ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరగ్గా.. షూటింగ్ ను శరవేగంగా మేకర్స్ జరుపుతున్నారు.

ఇప్పటికే మేకర్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్.. సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కలకత్తా హవ్‌ డా బ్రిడ్జ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పతాకం, హైదరాబాద్‌ చార్మినార్‌ ను అందులో చూపించారు మేకర్స్. 1940 దశకంలో జరిగే కథగా క్లారిటీ ఇచ్చారు. మాతృభూమి ప్రజలకు న్యాయం అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా మూవీ సాగుతుందన్నట్లు తెలిపారు. ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నట్లు వెల్లడించారు.

అయితే ఇప్పుడు ప్రభాస్, హను రాఘవపూడి మూవీ హీరోయిన్ ఇమాన్వి కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇన్ స్టాగ్రామ్ స్టార్ గా ఫుల్ పాపులర్ అయిన ఇమాన్వి.. హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకు డ్యాన్స్ వేసి ఓ రేంజ్ లో మెప్పిస్తుంటారు. లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ కు జోడీగా నటిస్తుండడం వల్ల హాట్ టాపిక్ గా మారారు. ట్రెండింగ్ లోనే ఉంటున్నారు.

రీసెంట్ గా మేకర్స్ షూట్ చేసిన ఓ సాంగ్ లో ఇమాన్వి అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఆమె యాక్టింగ్ టాలెంట్ పట్ల అంతా ఫుల్ సాటిస్ఫై అయినట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత ఇమాన్వి ఫేమ్ ఓ రేంజ్ కు చేరుతుందని అంతా అంచనా వేస్తున్నారు. ఇమాన్వి.. స్టార్ హీరోయిన్ గా మారడం పక్కా అని కామెంట్లు పెడుతున్నారు. హను రాఘవపూడి కూడా తన సినిమాల్లో హీరోయిన్లను సరైన రీతిలో ప్రజెంట్ చేస్తారని గుర్తు చేస్తున్నారు.

అదే సమయంలో హను రాఘవపూడి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ సీతారామం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సినిమాతో ఎంతో మంది తెలుగు ప్రియులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిన ఆమె.. టాలీవుడ్ సీతగా పేరు సంపాదించుకున్నారు. మూవీలో తన పాత్రలో ఒదిగిపోయి తెలుగులో భారీ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు.

అయితే సినిమాలో మృణాల్ ను హను రాఘవపూడి.. తెలుగు ప్రియులను ఆకట్టుకునే విధంగా చూపించారనే చెప్పాలి. ఎంతో అందంగా, ఓ మంచి ప్రేయసిగా మృణాల్ రోల్ ను డిజైన్ చేశారు. కథ పరంగా ఎమోషనల్ గా, పర్ఫెక్ట్ నటిగా ఆమెను హైలెట్ చేశారు. మరి ఇప్పుడు ఇమాన్వి విషయంలో ఆయనేం చేస్తారో చూడాలని నెటిజన్లు అంటున్నారు. ఏదేమైనా మృణాల్ రేంజ్ లో ఇమాన్వి క్లిక్ అవుతారో లేదో వేచి చూడాలి.

Tags:    
  • Prabhas 
  • Imanvi 
  • Hanuraghavapudi 
  • Mrunalthakur 
  • Sitharamam 
  • Telugumovie 
  • Tamilsongs 
  • Starheroine 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

Copyright @2026

Powered by Blink CMS