వార్ 2: 80 కోట్ల రిస్కులో సేవ్ చేసేదెవరు?
సూపర్ స్టార్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘వార్ 2’పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది;
సూపర్ స్టార్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘వార్ 2’పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా చుట్టూ స్పష్టమైన బజ్ లేదన్నది ఇండస్ట్రీలో ప్రస్తుతం వినిపిస్తున్న గట్టి వాదన. గతంలో ‘వార్’ ఘనవిజయం సాధించిందనే నేపథ్యం ఉండటంతో సీక్వెల్ పై అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇప్పటివరకు మేకర్స్ అందించిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
ఇందులో భాగంగా, ముఖ్యంగా సౌత్ బెల్ట్‌లో ఈ సినిమాపై క్రేజ్ ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. దీనికి కారణం పాటలు, ట్రైలర్, ప్రమోషన్ల లోపమే. ఇక ఆగస్టు 14న అదే సమయానికి కూలి కూడా రానుంది. అయితే 'కూలీ' వర్షన్ బ్లాస్ట్ అవుతూ ప్రమోషన్లతో దూసుకెళ్తుంటే, ‘వార్ 2’ బోల్డ్‌గా ఉండాల్సిన సమయంలో మాత్రం పెద్దగా సౌండ్ చేయడం లేదు. స్టిల్స్ లేవు, పాటలు లేవు, కంటెంట్ రిలీజ్ చేయడం లేదు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఇదే ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఏ ప్లాన్ ఉందా అని.
‘వార్ 2’ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత నాగ వంశీ సొంతం చేసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ దేవర ను కూడా ఆయనే హక్కులు కొని రిలీజ్ చేశారు. ఇక సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఆయన, ఇప్పుడు ‘వార్ 2’ను కూడా భారీగా ప్రెజెంట్ చేయబోతున్నారన్న విశ్వాసం ఉంది. మరోవైపు కూలి తెలుగు రైట్స్ ను ఏషియన్ సునీల్ నారంగ్, సురేశ్ బాబు, దిల్ రాజుతో కలిసి దాదాపు రూ. 48 కోట్లకు (జీఎస్టీ మినహాయించి) ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో థియేటర్స్ విషయంలో క్లాష్ ఏర్పడే అవకాశం లేకపోలేదు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం మూవీపై ఉన్న బజ్‌ని బూస్ట్ చేయాలంటే తెలుగు స్టేట్స్‌లోనే ఓ భారీ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ట్రైలర్ రిలీజ్ డేట్‌తో పాటు ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరిని ప్రమోషన్లలో వాడుకోవడమే ఇప్పుడు కీలకం. నాగ వంశీ ఇప్పటికే గేమ్‌చేంజింగ్ ప్రమోషన్లు చేసిన ట్రాక్ రికార్డ్ కలవారు. ఆయన మార్క్ ఈవెంట్‌తో సినిమా టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరేలా చేయగలడన్న నమ్మకం ఉంది. సినిమాకి ఓపెనింగ్స్ ప్రధాన బలం. కాబట్టి బజ్ గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది.
కాగా, మరోవైపు లెజెండరీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ మూవీ ప్రమోషన్లు భీభత్సంగా నడుస్తున్నాయి. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి తారాగణంతో ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. కానీ అది పూర్తిగా ‘సౌత్ ఫ్లేవర్’తో ఉండటంతో ఉత్తర భారత ప్రేక్షకుల్లో కొంత పరిమితిని ఎదుర్కొనవచ్చు. అదే సమయంలో ‘వార్ 2’ బాలీవుడ్‌కు బేస్‌గా ఉండటం పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది.
ఇక ‘వార్ 2’ ఇప్పటివరకు ఓ మిస్టీరియస్ మూడ్‌లో ఉండిపోయింది. కానీ ఇది 80 కోట్ల రిస్క్‌పై ఉన్న సినిమా. ఆ రిస్క్‌ను తగ్గించాలంటే నాగ వంశీ ప్రొఫెషనల్ టచ్ తప్పనిసరి. ట్రైలర్, ఈవెంట్ ప్లానింగ్, ఎన్టీఆర్ ప్రమోషన్లు అన్నింటినీ సమర్థంగా హ్యాండిల్ చేస్తేనే ఈ సినిమా హైప్‌ను గట్టిగా నిలబెట్టుకోగలదు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.