పిక్‌టాక్ : బ్లాక్‌లో బ్యూటీ అందాల ఆరబోత
విరాట్ కోహ్లీ పొరపాటున ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క లైక్ కొట్టిన కారణంగా ఓవర్ నైట్‌లో స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అవనీత్ కౌర్.;
విరాట్ కోహ్లీ పొరపాటున ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క లైక్ కొట్టిన కారణంగా ఓవర్ నైట్‌లో స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అవనీత్ కౌర్. ఈ అమ్మడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది, అంతకు ముందు సోషల్ మీడియాలో, మోడల్‌గా రాణించే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడూ రాని గుర్తింపు, ఎప్పుడూ దక్కని సోషల్ మీడియా ఫాలోయింగ్ కేవలం విరాట్ కోహ్లీ పొరపాటున కొట్టిన లైక్ కారణంగా వైరల్ అయింది. సాంకేతిక లోపం కారణంగా అవనీత్ కౌర్ ఫోటోకు కోహ్లీ నుంచి లైక్ పడిందని ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చింది. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. అవనీత్ గురించి జాతీయ స్థాయిలో మాట్లాడుకోవడం జరిగింది, ఆమె అందరికి సుపరిచితురాలు అయింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా లక్షల్లో ఫాలోవర్స్ సంఖ్య పెరగడం జరిగింది.
అవనీత్ కౌర్ సోషల్ మీడియాలో..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 31 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను ఈ అమ్మడు దక్కించుకోవడం వెనుక ఖచ్చితంగా విరాట్ కోహ్లీ లైక్ కారణం అంటూ చాలా మంది అంటూ ఉంటారు. తనకు సడెన్‌గా వచ్చిన ఫాలోయింగ్‌ను కొనసాగించుకునేందుకు ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌గా షేర్ చేస్తూ వస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా బ్లాక్ డ్రస్‌లో ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఈమె ముందు తక్కువే అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తున్న అవనీత్ కౌర్ కి రావాల్సిన ఆఫర్లు రావడం లేదు, దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు అంటూ చాలా మంది ఆమె ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందాల ఆరబోతతో వైరల్
తాజా ఫోటోలకు కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ దక్కాయి. అంతే కాకుండా వేలాది మంది ఈ ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి చేరుతున్నాయి. ఇక చాలా అందంగా ఉన్నారు, సినిమాల్లో మీరు మరింత బిజీ కావాలి, ఇంత అందంగా ఉండటం వల్లే మీ ఫోటోలకు కోహ్లీ లైక్ కొట్టాడు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేయడం మనం చూడవచ్చు. మొత్తానికి ఈ బ్లాక్ డ్రెస్ తో ముద్దుగుమ్మ అవనీత్ కౌర్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లోనే కాకుండా ఈమె సౌత్ ఇండియాలోనూ సినిమాలు చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. మొత్తానికి రకరకాలుగా ఈ అమ్మడి ఫోటోల గురించి ప్రచారం జరుగుతోంది. ఈ స్థాయిలో అందంగా ఉండటం వల్ల ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా బిజీ బిజీగా మారడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
హిందీ టీవీ షోల ద్వారా గుర్తింపు...
హిందీ టీవీ షోల ద్వారా గుర్తింపు దక్కించుకున్న అవనీత్ కౌర్ నటిగానూ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. అయితే హీరోయిన్‌గా ఈమెకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ దక్కలేదు. 2010లో జీ టీవీలో ప్రసారం అయిన డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ డాన్స్ షో తో ఈమె కెరీర్ ఆరంభం అయింది. ఆమె సెమీ ఫైనల్స్ వరకు వెళ్లడం ద్వారా చాలా మంది అభిమానం సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు డాన్స్ షో ల్లో పాల్గొనడం ద్వారా సినిమా ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. 2001లో పంజాబ్‌లోని జలంధర్ లో సోనియా నంద్రా, అమన్ దీప్ సింగ్ నంద్రాలకు సిక్కు కుటుంబంలో అవనీత్ కౌర్ జన్మించింది. ముంబైకి షిప్ట్ అయిన ఈ అమ్మడు నటిగా సినిమా ఇండస్ట్రీలో మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంది. భవిష్యత్తులో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ సరసన ఈమె నిలుస్తుందనే విశ్వాసం అంతా వ్యక్తం చేస్తున్నారు.