బిగ్ బాస్ కొత్త సీజ‌న్ హోస్ట్ మార్పు వెన‌క‌?

బిగ్ బాస్ OTT మునుపటి సీజన్ భారీ విజయం సాధించ‌డంతో జియో సినిమా మూడవ సీజన్‌ను త్వరలో ప్రారంభించ‌డానికి సిద్ధంగా ఉంది

Update: 2024-05-23 10:30 GMT

బిగ్ బాస్ OTT మునుపటి సీజన్ భారీ విజయం సాధించ‌డంతో జియో సినిమా మూడవ సీజన్‌ను త్వరలో ప్రారంభించ‌డానికి సిద్ధంగా ఉంది. షో కొత్త‌ సీజన్‌లో పోటీదారులు ఎవ‌రెవ‌రు? అనేదానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన‌గా.. ఈ సీజన్‌కు ఎవరు హోస్ట్‌గా కనిపిస్తారనే దానిపైనా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్ర‌స్తుతం ఓ ముగ్గురు ప్ర‌ముఖులు పోటీలో ఉన్నార‌నేది గుస‌గుస‌.

రియాలిటీ షో 3వ‌ సీజన్‌ను హోస్ట్ చేయడానికి సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ పోటీలో ఉన్నారని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. అయితే జియో సినిమాస్ ఇటీవలి ప్రోమో ఈ సీజన్‌లో షో హోస్ట్‌గా అనిల్ కపూర్‌ను ఖరారు చేసార‌ని స్ప‌ష్ఠ‌త‌నిచ్చింది. ప్రోమోలోని వాయిస్ ఓవర్ `ఏక్దమ్ ఝాకాస్` అనిల్ కపూర్ కి ఉన్న పాజిబిలిటీని రివీల్ చేసింది.

తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. అనిల్ కపూర్‌కు సల్మాన్ ఖాన్ కంటే తక్కువ వేతనం లభిస్తుందని తెలిసింది. సల్మాన్ ఖాన్ ఒక్కో ఎపిసోడ్‌కి 12 కోట్లు వసూలు చేస్తుండగా, అనీల్ క‌పూర్ ఒక్కో ఎపిసోడ్‌కు 2 కోట్లు వసూలు చేస్తున్నాడని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌స్తుతానికి ఇవ‌న్నీ ఊహాజనిత గణాంకాలు మాత్రమే.. అయితే రియాలిటీ షోకి అనిల్ కపూర్ ఎలాంటి ఫ్లేవర్‌ని తీసుకువస్తాడో అన్న‌ది ఆసక్తికరం. అనిల్ కపూర్ ఇంతకుముందు కలర్స్ టీవీ కోసం 24 అనే షోని హోస్ట్ చేసారు. గ్యాప్ త‌ర్వాత బిగ్ బాస్ OTT 3 తో హోస్ట్‌గా కంబ్యాక్ అవుతున్నాడు.

బిగ్ బాస్ OTT కొత్త‌ సీజన్‌లో పాల్గొనడానికి మాక్స్‌టర్న్, షెహజాదా ధామి, ప్రతీక్షా త‌హోన్‌ముఖే, రోహిత్ జింజుర్కే స‌హా ప‌లువురు ప్రముఖుల‌ను సంప్రదించారని తెలిసింది. షో మునుపటి సీజన్ భారీ విజయాన్ని సాధించిగా, ఇంటర్నెట్ సంచలనం ఎల్విష్ యాదవ్ కిరీటం గెలుచుకున్నాడు.

Tags:    

Similar News