శివాజీకే నా స‌పోర్ట్.. ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డుతున్నా!

తెలుగు బిగ్ బాస్9 రియాలిటీ షో తో విప‌రీత‌మైన గుర్తింపుని తెచ్చుకున్న అల‌నాటి హీరోయిన్ సంజ‌నా గ‌ల్రాని బుజ్జిగాడు మూవీతో అంద‌రికీ సుప‌రిచితురాలే.;

Update: 2026-01-08 09:50 GMT

తెలుగు బిగ్ బాస్9 రియాలిటీ షో తో విప‌రీత‌మైన గుర్తింపుని తెచ్చుకున్న అల‌నాటి హీరోయిన్ సంజ‌నా గ‌ల్రాని బుజ్జిగాడు మూవీతో అంద‌రికీ సుప‌రిచితురాలే. బుజ్జిగాడు త‌ర్వాత కూడా సంజ‌న కొన్ని సినిమాలు చేశారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని టాలీవుడ్ కు దూర‌మైన సంజ‌న రీసెంట్ గా మ‌ళ్లీ బిగ్ బాస్9లో క‌నిపించి అంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకున్నారు.

బిగ్‌బాస్ తో కొత్త ఇమేజ్ ను తెచ్చుకున్న సంజ‌న‌

బిగ్ బాస్9లో టాప్5 గా నిలిచి ఎవ‌రూ ఊహించ‌ని క్రేజ్, ఫాలోయింగ్ ను తెచ్చుకున్నారు. షోకు రాక‌ముందు త‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లున్నాయి. కానీ బిగ్ బాస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాక వాటిని డామినేట్ చేసేంత ఇమేజ్ ను సృష్టించుకుని వెళ్లారు సంజ‌న‌. రీసెంట్ గా మీడియా ముందుకొచ్చిన సంజ‌న త‌న ఫ్యామిలీ గురించి, రీసెంట్ గా హీరోయిన్ల డ్రెస్సింగ్ పై వ‌స్తున్న కామెంట్స్ గురించి మాట్లాడారు.

గ్లామ‌ర్ షోను త‌ప్పుబ‌డుతూ కామెంట్స్

హీరోయిన్లు, ఆడ‌వాళ్ల డ్రెస్సింగ్ గురించి రీసెంట్ గా శివాజీ చేసిన కామెంట్స్ ఏ రేంజ్ లో వైర‌ల్ అవుతున్నాయో తెలిసిందే. ఈ విష‌యంలో కొంద‌రు శివాజీకి స‌పోర్ట్ గా మాట్లాడుతుంటే, మ‌రికొంద‌రు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతూ వ‌స్తున్నారు. రీసెంట్ గా సంజ‌న ఈ విష‌యంలో మాట్లాడుతూ త‌న స‌పోర్ట్ శివాజీకే అని చెప్పారు. గ్లామ‌ర్ షో ను త‌ప్పుబ‌డుతూ, కంఫ‌ర్ట్ డ్రెస్ వేసుకోవాల‌ని, అతిగా గ్లామ‌ర్ చేస్తే అది త‌ర్వాత మీకే ఇబ్బందుల్ని క‌లిగిస్తుంద‌ని ఆమె చెప్పారు.

చెప్పే వాళ్లు లేక ఆ త‌ప్పు చేశా

ఒక‌ప్పుడు తాను చాలా వ‌రకు గ్లామ‌ర్ రోల్స్ చేశాన‌ని, అవ‌స‌రం లేక‌పోయినా కొన్నిసార్లు శ్రుతిమించి ఎక్స్‌పోజ్ చేశాన‌ని, అవ‌న్నీ ఇప్పుడు చూసుకుంటే చాల ఇబ్బందిగా ఉంద‌ని, పెళ్లై, పిల్లలు పుట్టాక అలాంటి ఫోటోలు చూస్తే ఇలా ఎందుకు చేశాన‌ని బాధ‌ప‌డుతున్నాన‌ని, అప్పుడు ఎలా ఉండాలో తెలియ‌క‌పోవ‌డంతో పాటూ ఎవ‌రూ చెప్పేవాళ్లు లేక‌నే చేశాన‌ని, కొన్ని వెబ్‌సైట్స్ కు కాల్ చేసి ఆ పాత ఫోటోల‌ను డిలీట్ చేయ‌మ‌ని కూడా తాను రిక్వెస్ట్ చేసిన‌ట్టు సంజ‌న తెలిపారు.

అనుభ‌వంతో చెప్తున్నా

ఎవ‌రైనా స‌రే న‌చ్చిన బ‌ట్ట‌లు, కంఫ‌ర్ట్ గా ఉండే బ‌ట్ట‌లు వేసుకోవ‌చ్చ‌ని, కానీ ఓవ‌ర్ గా ఎక్స్‌ఫోజ్ చేయొద్ద‌ని, గ్లామ‌ర్ గా క‌నిపించ‌డంలో త‌ప్పులేదు కానీ అది ఓవ‌ర్ అయితేనే స‌మ‌స్య అని, ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ 35 ఏళ్లు దాటి, పెళ్లై పిల్ల‌లు పుట్టాక‌, వాళ్లు మీ ఫోటోల‌ను చూసి ఇబ్బంది ప‌డిన‌ప్పుడు దాన్ని మ‌నం తీసుకోలేమ‌ని, తాను ఈ విష‌యాన్ని అనుభ‌వంతో చెప్తున్నాన‌ని సంజ‌న చెప్ప‌గా, ఈ కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Tags:    

Similar News