బిగ్ బాస్ 9 : కంటెస్టెంట్స్ మధ్య అంతస్తుల అంతరాయం..!

ఇప్పటికే ఎవరెవరు వస్తున్నారన్నది కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 కోసం బిగ్ బాస్ సెట్ అంతా రెడీ చేశారట.;

Update: 2025-08-31 07:58 GMT

బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా సెలబ్రిటీస్ తో పాటు కామన్ మ్యాన్ కూడా ఈక్వల్ గా వస్తారని టాక్. అంటే 9 మంది సెలబ్రిటీస్ అయితే మిగతా 9 మెంబర్స్ కామన్ మ్యాన్ నుంచి వస్తారు. వారి కోసమే బిగ్ బాస్ అనిపరీక్ష షో నడిపిస్తున్నారు. ప్రెజంట్ అందులో 15 మంది ఉండగా వారిలో ఐదుగురు బిగ్ బాస్ సీజన్ 9 లో ఛాన్స్ అందుకుంటారని తెలుస్తుంది. ఐతే మిగతా నలుగురి ఎంపిక ఎలా జరుగుతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

సెలబ్రిటీ కంటెస్టెంట్స్ గా..

ఇప్పటికే ఎవరెవరు వస్తున్నారన్నది కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 కోసం బిగ్ బాస్ సెట్ అంతా రెడీ చేశారట. ఐతే ఈసారి హౌస్ లో కూడా రెండు లేదా నాలుగు భాగాలుగా ఉంటుందని టాక్. కిచెన్ లివింగ్ ఏరియా ఒకటే కానీ రూంస్ మాత్రం రెండు లేదా నాలుగు ఉంటాయట. అది కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఉంటాయని తెలుస్తుంది.

కంటెస్టెంట్స్ మధ్య ఈ అంతస్తుల అంతరాయం ఎందుకో బిగ్ బాస్ కే తెలియాలి. ఎవరిని పైన రూం లో ఉంచుతారు. ఎవరిని కింద ఉంచుతారు అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 లో ముందు నుంచి చెబుతున్న రణరంగం అయితే పక్కా అనేలా ఉంది. కామన్ మ్యాన్ ఎంపిక కూడా బాగానే జరుగుతుంది.\

సీజన్ 9 ని విజయవంతం చేయాలని..

బిగ్ బాస్ సీజన్ 9 ని విజయవంతం చేయాలని బిగ్ బాస్ టీం బాగా కృషి చేస్తుంది. సీజన్ మొదలు పెట్టడానికి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా షోని ఎంగేజ్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఆడియన్స్ ఆల్రెడీ బిగ్ బాస్ థీం లోకి వచ్చేశారు. మరో వారం రోజుల్లో 3 నెలల పాటు జరిగే ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతున్నారు. సో బిగ్ బాస్ సీజన్ 9 ఇదివరకు అన్ని సీజన్ల కన్నా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి సీజన్ 9 షోలో ఎవరెవరు వస్తారు.. ఎవరు బిగ్ బాస్ ఆడియన్స్ మనసులు గెలుస్తారు అన్నది చూడాలి. హోస్ట్ నాగార్జున కూడా ఈసారి మరింత ఎనర్జీతో ఈ సీజన్ నడిపించాలని చూస్తున్నారట.

Tags:    

Similar News