బిగ్ బాస్: లాస్ట్ మూమెంట్లో ఆమె అవుట్.. సూట్ కేస్ ఆఫర్ అతనికేనా?
అటు మరోవైపు కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టిన పవన్ , కళ్యాణ్ ఇద్దరికీ కూడా టైటిల్ విజేత అవ్వాలనే కోరిక ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.;
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. గ్రాండ్ ఫినాలే రేపు చాలా ఘనంగా జరగబోతోంది. డిసెంబర్ 21న విజేత ఎవరో తేలనుంది.. ఆ లోపే ఈరోజు ఎలిమినేషన్ లో భాగంగా ప్రముఖ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా.. మిగిలిన నలుగురిలో ఆయనకు సూట్ కేస్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇమ్మానుయేల్, తనూజ, సంజన, కళ్యాణ్, పవన్ హౌస్ లో టాప్ ఫైవ్ లో చేరిపోయారు. అయితే ఈ టాప్ 5 నుంచి లాస్ట్ 5మూమెంట్ లో సంజనను ఎలిమినేట్ చేశారు. ఇక మిగిలిన నలుగురిలో కళ్యాణ్, తనూజ విన్నర్ రేస్ లో ఉండగా.. పవన్, ఇమ్మానుయేల్ ఇద్దరికీ నాగార్జున సూట్ కేస్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి టైటిల్ రేస్ కోసం ఇమ్మానుయేల్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు జబర్దస్త్ కార్యక్రమం నుంచి హౌస్ లోకి అడుగుపెట్టిన ఏ కమెడియన్ కి కూడా టైటిల్ విజేతగా ప్రకటించలేదు. కాబట్టి ఆయన ప్రయత్నాలు ఫలించవని.. బిగ్ బాస్ ఇచ్చే సూట్ కేస్ ఆఫర్ రూ.40 లక్షల తీసుకొని బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అటు మరోవైపు కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టిన పవన్ , కళ్యాణ్ ఇద్దరికీ కూడా టైటిల్ విజేత అవ్వాలనే కోరిక ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడు రీతు చౌదరి కూడా పవన్ తో టైటిల్ గెలిచి రావాలి అని తన కోరికగా చెప్పుకొచ్చింది. కానీ బయట మాత్రం కళ్యాణ్ - తనూజ ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే టైటిల్ విజేత అయ్యే అవకాశం, అర్హత ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే కళ్యాణ్, తనూజ అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు. ముందు నుంచే ఈసారి సీజన్ విన్నర్ తనూజ అంటూ గట్టిగానే ప్రచారం జరుగుతోంది.
కానీ తనూజాకు గట్టి పోటీ ఇస్తూ కళ్యాణ్ దూసుకొచ్చేశారు. కామనర్ గా అడుగుపెట్టిన ఈ సోల్జర్ తనదైన వ్యూహం మార్చి టాస్క్లలో అదరగొట్టి మాట తీరుతో జనాలను కూడా కట్టిపడేశాడు. అటు హౌస్ లో కళ్యాణ్ , తనూజ ఇద్దరు కూడా స్నేహితులుగా ఉన్నా.. బయట అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. మరి ఇలాంటి సమయంలో ఇద్దరిలో ఎవరిని టైటిల్ విజేతగా ప్రకటిస్తారో తెలియాలంటే రేపటి గ్రాండ్ ఫినాలే వరకు ఎదురు చూడాల్సిందే. ఏది ఏమైనా ఈసారి ఉత్కంఠ మాత్రం భారీగా పెరిగిపోయింది