బిగ్ బాస్ 9.. డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. ఆ కంటెస్టెంట్ కి బైబై..?

బిగ్ బాస్ సీజన్ 9లో ఏ సీజన్ లో లేని విధంగా సీజన్ లో ఇప్పటికే డబల్ ఎలిమినేషన్ రెండు సార్లు జరిగాయి.;

Update: 2025-11-29 05:26 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ఏ సీజన్ లో లేని విధంగా సీజన్ లో ఇప్పటికే డబల్ ఎలిమినేషన్ రెండు సార్లు జరిగాయి. ఐతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మరోసారి డబల్ ఎలిమినేషన్ అది కూడా ఈ వారం ఉండబోతుందని తెలుస్తుంది. సీజన్ 9లో చివరి వారం అంటే 11వ వారం ఇమ్మాన్యుయెల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రా వాడి సంజన, దివ్యాలలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉన్నా ఆ ఎలిమినేషన్ కాకుండా చేశాడు.

ఐతే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేకపోవడంతో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం శనివారం ఒక ఎలిమినేషన్, ఆదివారం రెండో ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది.

ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా..

ఐతే సీజన్ 9లో ఇలా డబల్ ఎలిమినేషన్ జరగడం మూడవసారి. ఐతే ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా దివ్య నిఖిత మొదట ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా కామనర్ కేటగిరిలో బిగ్ బాస్ హౌస్ లో షో స్టార్ట్ అయిన 2 వారాల తర్వాత ఆమె హౌస్ లోకి వెళ్లింది. హౌస్ లో భరణితో ఆమె ఒక మంచి బాండింగ్ ఏర్పరచుకుంది. తనూజతో రైవల్రీ కొనసాగించింది. ఫైనల్ గా హౌస్ లో తన ఆటతో మెప్పించింది.

మరో 3 వారాలు ఉండగా సీజన్ 9లో ఆమె జర్నీ పూర్తైంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో దివ్యకే లీస్ట్ ఓటింగ్ వచ్చింది. అసలైతే లాస్ట్ రెండు వారాలుగా దివ్య ఏదో ఒక విధంగా సేఫ్ అవుతూ వచ్చింది. లాస్ట్ వీక్ ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయినా కూడా ఇమ్మాన్యుయెల్ పవర్ అస్త్ర వాడటం వల్ల సేఫ్ అయ్యింది. సో వారం ముందే బయటకు రావాల్సిన దివ్య వారం తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. ఐతే దివ్యతో పాటు రెండో ఎలిమినేషన్ ఎవరన్నది సస్పెన్స్ కొనసాగుతుంది.

లిస్ట్ లో భరణి, సుమన్, సంజన..

ఈ లిస్ట్ లో భరణి, సుమన్, సంజన ముగ్గురు ఉన్నారు. వీరిలో ఈ వారం రెండో ఎలిమినేషన్ ఎవరన్నది ఆదివారం తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఆడియన్స్ అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎంగేజ్ చేసే కంటెంట్ కూడా హౌస్ మేట్స్ ఇచ్చారు. ఐతే ఈ వారం మొదటి ఎలిమినేట్ ఎవరన్నది క్లారిటీ రాగా రెండో హౌస్ మేట్ ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు అన్నది.. ఆడియన్స్ ఎవరిని బయటకు పంపించడానికి ఓట్ వేశారన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 చివరి 3 వారాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. ఐతే ఈ టైం లో టాప్ 5 కోసం అందరు తమ తమ బెస్ట్ ఇస్తున్నారు.

Tags:    

Similar News