ప్రేమ పేరుతో వాడుకొని మోసం చేశాడు.. బ్రేకప్ పై బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్!
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా తన జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన ప్రేమ కథను బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది.;
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా తన జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన ప్రేమ కథను బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రేమించిన వ్యక్తి తనను ఆర్థికంగా వాడుకొని ఎలా నట్టేట ముంచాడో చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కెరీర్ బాగున్న సమయంలోనే ఎదురైన ఈ మోసం వల్ల ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇనయా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి ..
నమ్మించి గొంతు కోశాడు:
ఇనయా సుల్తానా అంటే బిగ్ బాస్ ప్రేక్షకులకు ఒక బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ అమ్మాయిగా తెలుసు. కానీ, ఆమె వెనుక ఇంతటి పెయిన్ ఫుల్ స్టోరీ ఉందని ఎవరూ ఊహించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను ఒక వ్యక్తిని పిచ్చిగా ప్రేమించానని, అతనితోనే జీవితం, పిల్లలు అని ఇలా ఎన్నో కలలు కన్నానని తెలిపింది. కానీ అతను మాత్రం ఆమె ఫేమ్, డబ్బును చూసి దగ్గరయ్యాడని, చివరకు తన అవసరం తీరాక వదిలేశాడని తెలిపింది.
ఆర్థికంగా కూడా నష్టం:
ఇక కేవలం మానసిక వేదన మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా ఇనయా తీవ్రంగా నష్ట పోయినట్టు తెలిపారు ఆమె మాట్లాడుతూ.. "నేను అతనిని నమ్మి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అతను బిజినెస్ పేరు తో డబ్బు అడిగితే నా చేతికి ఉన్న బంగారు గాజులు కూడా అమ్మి ఇచ్చాను. కానీ అతను అక్కడ కూడా నన్ను ముంచేశాడు. బ్రేకప్ అయ్యే సమయానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, అంతా జీరో బ్యాలెన్స్" అని ఆవేదన వ్యక్తం చేసింది.
నిద్ర మాత్రలే ఆధారం:
ఈ మోసాన్ని భరించలేక ఇనయా తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆ బాధ నుంచి బయటపడలేక డ్రింక్ కూడా చేయాల్సి వచ్చిందని ఆమె నిజాయితీగా ఒప్పుకుంది. "నాకు నిద్ర రావాలంటే నిద్ర మాత్రలు వేసుకోవాల్సిందే. లేదంటే ఆ పాత జ్ఞాపకాలు నన్ను నిద్రపోనివ్వడం లేదు" అని ఆమె చెప్పడం చూస్తుంటే ఆమె ఎంతటి నరకాన్ని అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా:
బిగ్ బాస్ తర్వాత ఏడాది పాటు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఇనయాకు, ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడం, తోడుగా ఉంటాడనుకున్న వ్యక్తి మోసం చేయడంతో ఒంటరితనం వేధించింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధాకరమైన గతం నుంచి తాను బయటపడుతున్నానని ఆమె వెల్లడించింది. తనలాగా మరెవరూ మోసపోకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది.
సెలబ్రిటీల జీవితాలు పైకి గ్లామరస్‌గా కనిపించినా, లోపల ఎన్నో కష్టాలు ఉంటాయని ఇనయా ఉదంతం మరోసారి నిరూపించింది. ఇక ఏది ఏమైనా, ఇంతటి కష్ట సమయాన్ని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వస్తున్న ఇనయాను చూసి నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. త్వరలోనే ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.