భోళా అన్నయ్య క్షమించినా తమ్ముడు ఇచ్చేస్తాడు!
భోళాశంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగా బ్రదర్స్ గురించి ఒక అభిమానిగా హైపర్ ఆది ఎమోషనల్ స్పీచ్ ఆకట్టుకుంది
''ఎవరు ఎలాంటి మాటలు అన్నా అన్నయ్య క్షమించాడు కానీ తమ్ముడు క్షమించడు. అన్నిటికీ సమాధానమిస్తాడు'' అన్నారు టీవీ మూవీ నటుడు హైపర్ ఆది. భోళాశంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగా బ్రదర్స్ గురించి ఒక అభిమానిగా హైపర్ ఆది ఎమోషనల్ స్పీచ్ ఆకట్టుకుంది. అన్నయ్య సినిమాల కలెక్షన్లపై కామెంట్లు చేసినా పరాజయాలను విమర్శించినా వెంటనే ఒక బ్లాక్ బస్టర్ తో సమాధానమిస్తాడని అందుకు వాల్తేరు వీరయ్య ఉదాహరణ అని కూడా ఆది అన్నాడు.
మెగాస్టార్ రాజకీయాల్లోకి రాకముందు అవార్డులిచ్చిన ప్రభుత్వాలే ఆయన రాజకీయాల్లోకి రాగానే బ్లడ్ బ్యాంక్ పై తప్పుడు కూతలు కూశాయని వ్యాఖ్యానించిన హైపర్ ఆది.. అన్నయ్య దేనిని అయినా క్షమించేశాడని చాలామంది చాలా విరోధం చూపించినా కానీ క్షమించేశాడని అన్నారు. అలాగే మెగా బ్రదర్స్ ముగ్గురు అన్నదమ్ముల్లో నాగబాబును తక్కువ చేసి మాట్లాడతారని కానీ బ్రదర్స్ ఇద్దరనీ కాచేసేది నాగబాబు అని ఆది తన అభిమానం చాటుకున్నారు. ఇండస్ట్రీలో ఒక దర్శకుడు చిరుని రాజకీయంగా విమర్శిస్తున్నాడని అన్నయ్య కనుసైగ చేస్తే అభిమానుల గాలికి అతడు ఏమవుతాడో ఊహించుకోండి అని కూడా ఆది వ్యాఖ్యానించారు. కానీ చిరంజీవి అలాంటివేవీ పట్టించుకోరని అన్నారు.
సినీపరిశ్రమలో ఎందరో ప్రతిభావంతులను అన్నయ్య పైకి తీసుకొచ్చారని, టీవీ పరిశ్రమలో నాలాంటి ఎందరికో అవకాశాలు కల్పించి ప్రోత్సహించారని నాగబాబుని ప్రశంసించారు హైపర్ ఆది. అలాగే పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవర్ స్టార్ జనసేనానిగా సత్తా చాటుతారని ప్రత్యర్థులకు సరైన సమాధానమిస్తారని అన్నారు. అలాగే చాలామంది అన్నయ్యను పొగిడేస్తూ ఇటీవల తమ్ముడిని తిట్టేస్తున్నారని.. తన తమ్ముడిని అంటుంటే చిరు ఎంతో ఎమోషనల్ అవుతున్నారని కూడా ఆది వెల్లడించారు.
మెగా బ్రదర్స్ అనుబంధం ఎలాంటిదో ఆది వ్యక్తీకరించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. భోళాశంకర్ చిత్రం ఈ ఆగస్టులో విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఎదుటే హైపర్ ఆది సహా ఇతర స్టార్లు ఎమోషనల్ స్పీచ్ లతో కట్టిపడేశారు. భోళాశంకర్ చిత్రంలో తమకు అవకాశం కల్పించిన మెగాస్టార్ చిరంజీవిపై నటీనటులు ప్రేమాభిమానాలను వ్యక్తం చేయడం ఈ వేదికపై హైలైట్.