• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భారతీయుడు 2.. మళ్ళీ...

భారతీయుడు 2.. మళ్ళీ ఇదెక్కడి ట్విస్ట్ సామీ

| 28 ఏళ్ళ క్రితం కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

By - Tupaki Desk
Update: 2024-07-01 06:04 GMT

28 ఏళ్ళ క్రితం కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ నటవిశ్వరూపం చూపించారు. అవినీతి చేసేవారికి మరణశిక్ష వేసే వాడిగా కమల్ హాసన్ నటించారు. తప్పుచేసాడని చివరికి సొంత కొడుకుని కూడా చంపేస్తాడు. ఆ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యింది. మరల ఇన్నేళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తోంది.

జులై 12న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. భారతీయుడు 100+ వయస్సులో ఉన్నట్లు ఈ సీక్వెల్ లో చూపించారు. అలాగే భారీ ఫైట్స్ చేసినట్లు చూపించారు. మూవీలో సిద్ధార్ధ్ యంగ్ హీరోగా సొసైటీలో అవినీతి మీద పోరాటం చేస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో సేనాపతి ఇండియా తిరిగి వస్తాడు.

సొసైటీలో పెరిగిపోయిన అవినీతిపై తన స్టైల్ లో పోరాటం చేస్తూ యుద్ధం చేస్తాడని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ఇంచుమించు ట్రైలర్ లోనే భారతీయుడు 2 కథ ఏంటనేది శంకర్ చెప్పేశాడు. ఈ ట్రైలర్ బట్టి సోషల్ మీడియాలో మూవీపైన రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అలాగే భారతీయుడు 3 కూడా ఉండబోతోందని శంకర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పార్ట్ 3 స్టోరీ ఇదే అంటూ చాలా గాసిప్స్ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.

ఇదిలా ఉంటే భారతీయుడు 2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ సినిమా కథపై ఇంటరెస్టింగ్ కామెంట్ చేశారు. ఎవరికి వారు ఏ కథలు ప్రచారం చేసిన వాటికి భిన్నంగా భారతీయుడు 2 ఉంటుందని అన్నారు. కచ్చితంగా మూవీలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు. అదే సమయంలో భారతీయుడు 3లో సేనాపతి తండ్రి పాత్ర కూడా వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. సేనాపతి తండ్రి పాత్ర అంటే దానిని శంకర్ ఎలా డిజైన్ చేసి ఉంటాడా అనే ఆసక్తి అందరిలో ఉంది.

ఒక వేళ సీక్వెల్ గా చేస్తే ప్రస్తుతం సేనాపతి వయస్సు 100+ ఉంది. అతని తండ్రి క్యారెక్టర్ కచ్చితంగా 120+ ఉండే అవకాశాలు ఉంటాయనే మాట వినిపిస్తోంది. అయితే భారతీయుడు3ని ప్రీక్వెల్ గా చేసే అవకాశం ఉండొచ్చనే మరో ప్రచారం కూడా నడుస్తోంది. అయితే కమల్ హాసన్, తన సినిమాలు, ఎంచుకున్న పాత్రలతో ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. అలాగే శంకర్ కూడా కొత్త పాయింట్ ని తెరపై చూపించే ప్రయత్నం చేస్తారు. మరి భారతీయుడు2, 3 సినిమాలలో ఎలాంటి అంశాలని ప్రేక్షకులకి అందిస్తున్నారనేది తెలియాలంటే జులై 12 వరకు వేచి చూడాలి.

Tags:    
  • Bharateeyudu2 
  • Kamalhaasan 
  • Indian2 
  • Shankar 
  • Kollywood 
  • Kalki2898AD 
  • Thuglife 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS