• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'భగత్స్ బ్లేజ్': గ్లాస్...

'భగత్స్ బ్లేజ్': గ్లాస్ అంటే సైజు కాదు, కనిపించని సైన్యం!

| పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్ కల్యాణ్ ఆకట్టుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-19 12:35 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ''ఉస్తాద్ భగత్ సింగ్''. 'గబ్బర్ సింగ్' తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ మూవీ పవన్ ఇతర కమిట్మెంట్స్ వల్ల లేట్ అవుతూ వస్తోంది. అయితే చాలా కాలంగా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. ఇప్పుడు ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, బర్త్ డే పోస్టర్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్ కల్యాణ్ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా 'భగత్‌ బ్లేజ్' అంటూ ఓ సర్ప్రైజింగ్ వీడియోని సోషల్ మీడియాలో వదిలారు. హరీష్ శంకర్ మార్క్ వన్ లైనర్స్, పవర్ ఫుల్ యాక్షన్ కలబోసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. చాలా రోజులుగా పవర్ స్టార్ సినిమాల అప్డేట్స్ లేక మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా వుంది.

పోలీస్ గెటప్ లో పవన్ కల్యాణ్ చేతిలో కత్తులు బరిసెలు పట్టుకొని ఊచ కోత కోయడాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. టీ గ్లాస్ ను పగలగొట్టి 'నీ రేంజ్ ఇది' అని ఓ రౌడీ వార్నింగ్ ఇవ్వగా.. "గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది" అంటూ పవన్ పగిలిన గాజు ముక్కతో ఫైట్ చేయడం ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తుంది. "కచ్ఛితంగా గుర్తు పెట్టుకో, గ్లాస్‌ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం'' అంటూ చెప్పే డైలాగ్ గూస్ బంమ్స్ తెప్పిస్తుంది.

ఇప్పటి వరకూ షూట్ చేసిన రెండు షెడ్యూల్స్ నుంచి టీజర్ కట్ చేసి వదిలిన హరీశ్ శంకర్.. ఇప్పుడు అదే ఫూటేజ్ నుంచే 'భగత్స్ బ్లేజ్' వీడియోని కట్ చేసి రిలీజ్ చేశారు. అందుకే రెండింటిలో సేమ్ షాట్స్ కనిపిస్తాయి. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అయాంక బోస్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఎలాంటిస్పెషల్ సందర్భం లేకుండా ఈ వీడియోని రిలీజ్ చేయడంపై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను పక్కనపెట్టి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రావడతో ఎక్కడ చూసిన అదే వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఊహించని విధంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్డేట్ రావడంతో.. ఏపీలో ఎన్నికలకు ఏదో సంబంధం వుంటుందని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. వాళ్ళు అనుకున్నట్లుగానే తాజా వీడియో సోషల్ మీడియాలో పవన్ కు మరింత మైలేజ్ తీసుకొచ్చేలా 'గాజు గ్లాస్' ను ప్రధానంగా చూపించారు.

పవన్ కల్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీ గుర్తు గాజు గ్లాస్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'భగత్స్ బ్లేజ్' వీడియయోలో గ్లాస్ ను హైలైట్ చేయడమే కాదు, దాని చుట్టూనే డైలాగ్స్ చెప్పించారు. మామూలుగా పోలీస్ స్టేషన్ లో పోలీసాఫీసర్ కు, రౌడీలకు మధ్య గాజు గ్లాస్ గురించి డిస్కషన్ పెట్టడానికిసంబంధం లేదు. కాబట్టి ఇక్కడ పవన్ పొలిటికల్ మైలేజ్ కోసమే 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఇలాంటి డైలాగ్స్ పెట్టారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఒక నిమిషం వీడియోలోనే ఇలా ఉంటే, ఇంకా సినిమాలో ఇంకెన్ని డైలాగ్స్ ఉంటాయో అని ఆలోచిస్తున్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇది తమిళ్ లో హిట్టయిన తేరి రీమేక్ అనే టాక్ ఉంది. దీనికి ప్రముఖ దర్శకుడు కె. దశరధ్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా. సి. చంద్రమోహన్ అడిషినల్ రైటర్ గా వర్క్ చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.


Full View


Tags:    
  • Ustaadbhagatsingh 
  • Bhagatblaze 
  • Pawankalyan 
  • Sreeleela 
  • Harishshankar 
  • Devisreeprasad 
  • Mythrimoviemakers 
  • Apelections 
  • Jsp 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS